నాగార్జున సాగర్ గొడవపై నేతలు మాట్లాడొద్దు.. సీఈవో వికాస్ రాజ్
posted on Nov 30, 2023 @ 10:01AM
నాగార్జున సాగర్ వద్ద గోడవపై రాజకీయ నేతలెవరూ మాట్లాడొద్దని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు. ఆ విషయం పూర్తిగా పోలీసులు చూసుకుంటారనీ, ఆ విషయంపై రాజకీయ నేతల ప్రకటనలు కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయనీ హెచ్చరించారు.
ఇలా ఉండగా ఆయన ఎస్ఆర్ నగర్ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సారి తెలంగాణలో ఓటింగ్ శాతం పెరుగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. గ్రామాలలో ఉదయం నుంచే ప్రజలు ఉత్సాహంగా ఓటు వేయడానికి పోలింగ్ బూత్ ల వద్ద క్యూ కట్టారనీ, పట్టణ ప్రాంతాలలో మాత్రం మందకొడిగా పోలింగ్ జరుగుతోందనీ చెప్పారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం పది గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఆయన ఓటేయడానికి ఎస్ ఆర్ నగర్ పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్ ల వద్ద జనం క్యూ కట్టారని చెప్పారు. ఈసారి పెద్ద సంఖ్యలో ఓటింగ్ నమోదవుతుందని వివరించారు.