ట్రంప్ పాలనలో... భారీగా తగ్గిన అమెరికా వలస
posted on Aug 25, 2025 @ 10:38AM
ట్రంప్ పాలనలో గతంలో ఎన్నడూ లేనంతగా వలస దారులు తగ్గిపోయారు. తాజా గణాంకాల ప్రకారం ఒకటిన్నర మిలియన్ల మంది వలసదారులు రావడం తగ్గింది. 1960 తర్వాత ఆ స్తాయిలో తగ్గుదల నమోదు కావడం విశేషం.. మొన్నా మధ్య జేడీ వాన్స్ అన్న మాట ఏంటంటే, అమెరికా గ్రీన్ కార్డు పొందడం అంటే, పర్మినెంటుగా ఇక్కడే ఉండిపోయే అవకాశం ఏమీ కాదని అన్నారు. దీంతో ఇదో కొత్త చర్చకు తెరలేచింది.
ఇదిలా ఉంటే వివాహ గ్రీన్ కార్డుల విషయంలో కూడా భారీ ఎత్తున ఆ ప్రక్రియను కఠిన తరం చేశారు. బేసిగ్గానే గ్రీన్ కార్డుల్లో కఠిన నిబంధనలు ఉంటాయి. హెల్త్, క్రైమ్ హిస్టరీ మొత్తం చెక్ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే అసలు అమెరికాలో ఒక వ్యక్తి రాకకు ఆస్కారం ఏర్పరిచేది.. అతడు అమెరికా సమాజానికి ఏ విధమైన నాణ్యమైన సేవలు అందిస్తాడనే ఆలోచనతో. అతడి ఆరోగ్యమే సరిగా లేకుంటే అతడెలా సేవలు చేయగలడు? .అన్నది సగటు అమెరికన్ సమాజం ప్రశ్న.
దానికి తోడు అమెరికాలో నానాటికీ పని చేసే వయసుగల వారి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. వలస ద్వారా మాత్రమే వారు ఈ లోటు భర్తీ చేసుకోగలరు. అందుకే స్పేస్, సాఫ్ట్ వేర్, మెడికల్, లా వంటి రంగాల్లో భారత్, ఫుడ్, మ్యూజిక్, పాచిపని వంటి రంగాల్లో మెక్సికన్, ఇక ప్రొడక్ట్ మేకింగ్ చైనీస్ పై అధికంగా ఆధారపడుతుంటారు అమెరికన్లు. ఈ ఈ దేశాల నుంచి వలస తగ్గిపోతే అమెరికన్ సమాజంలో ఆయా రంగాల్లో పని సామర్ధ్యం పడకేస్తుంది. దీంతో అమెరికన్ ఆర్ధిక వ్యవస్త కుప్పకూలిపోయే ప్రమాదమేర్పడుతుంది.
తాజాగా విదేశీ ట్రక్ డ్రైవర్ల విషయంలో ఒక కీలక నిర్ణయం తీస్కుంది యూఎస్. ఫ్లోరిడాలో జరిగిన ఒక ప్రమాదంలో ముగ్గురు అమెరికన్లు మరణించారు. దీంతో విదేశీ ట్రక్ డ్రైవర్ల వీసాలను పునఃపరిశీలించి వీరిలో చాలా మంది వరకూ దేశం విడిచి వెళ్లిపోయేలా ప్లాన్ చేస్తోంది అమెరికా. వీళ్లలో అధిక శాతం మంది భారత్ నుంచి వచ్చిన సిక్కులే ఉంటారు. దీంతో ఇలాక్కూడా భారత్ కి ఇదొక ఇబ్బందికరమైన పరిణామం.
ఇలా రకరకాల పరిస్థితుల్లో అమెరికాలోని డాలర్ డ్రీమ్స్ కి భారతీయులకు గండిపడేలా తెలుస్తోంది. ఒకప్పుడు అంటే శాలరీ అంటే అమెరికన్ శాలరీగా ఫీలయ్యేవారు మనవాళ్లు. కారణం దాని డాలర్ తో పోలిస్తే రూపాయి చాలా చాలా తక్కువ కాబట్టి.. అయితే అమెరికన్లు వలసను, గ్రీన్ కార్డులను, ఆఖరికి అక్కడ పుట్టే వారికి ఇచ్చే పౌరసత్వం వంటి విషయాల్లో పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తుండటంతో.. ఈ కలలు కల్లలయ్యేలా తెలుస్తోంది.
ట్రంప్ బేసిక్ థియరీ ఏంటంటే మోస్ట్ విదేశీ టాలెంటెడ్ మాత్రమే తమ దేశం రావాలని. దానికి తోడు ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని నినదిస్తుంటారు. అయితే వలసదారులు ఏమంటారంటే.. ఇమ్మిగ్రెంట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. నిజానికి ఇది కూడా ఒక రకంగా నిజమే. అమెరికన్లు అమెరికాను గ్రేట్ అగైన్ చేయడం ఇప్పటి వరకూ జరగలేదు.
వారి హిస్టరీ మొత్తం వలసదారుల వల్ల మాత్రమే ఇంత భారీ అభివృద్ధి నమోదయ్యింది. ఆయా దేశాల్లో సరైన ఆదరణ లేని టాలెంటెడ్ యూత్ ఇక్కడికొచ్చి ఎంతో శ్రమించి ట్రిలియన్ డాలర్ కంపెనీలుగా వృద్ధి చేసి.. విపరీతమైన సంపద సృష్టి చేశారు. దాని ద్వారా ఇటు అమెరికాకు అటు ఎందరికో ఉద్యోగ ఉపాధి అవకాశాల వెల్లువగా మారింది. దీనంతటినీ ట్రంప్ కరిగించి.. కొత్త అమెరికా ప్రపంచం పుట్టించాలని చూస్తున్నాడు. అయితే ఇది జరిగే పనేనా? అన్నదే ఇక్కడ సస్పెన్స్ గా మారింది.