దక్షిణ భారతంలోనే అత్యంత అవినీతి రాష్ట్రం ఏదో తెలుసా?
posted on Dec 26, 2022 @ 2:37PM
దక్షిణ భారత దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రాలలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏదో తెలుసా?2019లో ఇండియన్ కరప్షన్ సర్వే 2019 ప్రకారం దక్షిణ భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దేశం మొత్తంలో టాప్ పొజిషన్ లో నిలిచిన రాష్ట్రం రాజస్థాన్. దేశం మొత్తంలో తెలంగాణ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది.
అత్యంత అవినీతి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 13వస్థానంలో నిలిచింది. అయితే ఈ గణాంకాలు 2019 నాటివి. అయితే 2019 నాటికి ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. నాడు అవినీతిలో టాప్ టెన్ లో వరుసగా రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, యూపీ, తెలంగాణ, కర్నాటక, పంజాబ్, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. 2019లో ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహించిన ఇండియా కరప్షన్ 2019 సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఆ సర్వేలో అవినీతి రాష్ట్రాల జాబితాలో కేరళ దిగువ నుంచి తొలి స్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 21 రాష్ట్రాల్లో ఈ సర్వేను ట్రాన్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహించింది. తెలంగాణ విషయానికి వస్తే ఆస్తుల రిజిస్ట్రేషన్, భూ వివాదాల అంశాల్లో అవినీతి అధికంగా జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగింది.
రాష్ట్రంలో పనులు పూర్తి కావాలంటే లంచాలు ఇవ్వాల్సిందేనని, తాము అలా లంచాలు ఇచ్చే పనులు చేయించుకున్నామని 67 శాతం మంది వివరించారు. వీరిలో 27 శాతం మంది పలుమార్లు లంచాలుఇచ్చినట్లు పేర్కొన్నారు. కేవలం 11 శాతం మంది మాత్రమే లంచాలు ఇవ్వకుండానే తమ పనులు అయ్యాయని చెప్పారు. అయితే ఇదంతా గతమనీ, తాజాగా అందుతున్న వివరాలను బట్టి అత్యంత అవినీతి జరుగుతున్నరాష్ట్రాల జాబితాలో ప్రస్తుతం ఏపీయే అగ్రస్థానంలో నిలుస్తుందని తెలుగుదేశం చెబుతోంది.
చంద్రబాబు హయాంలో విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందనీ, అవినీతికి దూరంగా ఉందనీ, అయితే జగన్ హయాంలో ఆ సీన్ రివర్స్ అయ్యిందనీ అవినీతిలో అగ్రస్థానానికి, అభివృద్ధిలో అధమస్థానానికీ పడిపోయందనీ విమర్శిస్తున్నారు.