కరుణానిధి వరాలు ఇవే..
posted on Apr 11, 2016 @ 3:03PM
తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి. ఏపార్టీ, ఏపార్టీతో పొత్తు పెట్టుకోవాలి.. ఎవరు ఏ నియాజక వర్గం నుండి పోటీ చేయాలి అని ఇప్పటికే అంతా సిద్దమైపోయింది. దీనిలో భాగంగానే నేతలు ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి.. వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి.. ఏరకంగా మేనిఫెస్ట్ తయారుచేయాలో కూడా చేసేవారు. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత కరుణానిధి తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలో కరుణానిధి ప్రజలకు ఇచ్చిన వరాల వివరాలు..
* ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్
* టీఏఎస్ఎంఏసీ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాల కల్పన
* విద్యార్థులకు ఉచిత నెట్
* నమాజ వార్ పథకం ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తులు తయారుచేయడంలో శిక్షణ
* సేతు సముద్రం కెనాల్ ప్రాజెక్టు ప్రారంభం
* రైతులకు కనీస మద్దతు ధర
* ప్రొహిబిషన్ చట్టం అమలు
* కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తమిళం అధికారిక భాషగా ప్రవేశపెట్టడం
* ప్రసూతి సెలవులు 9 నెలలకు పెంపు
* లోకాయుక్త ఏర్పాటు
* కొత్త పారిశ్రామిక వేత్తలకు రూ.లక్ష పెట్టుబడి
* అన్ని జిల్లాల్లో ఉపాధి కేంద్రాలు
* 750 చేనేత యూనిట్లకు ఉచిత విద్యుత్
* రేషన్ కార్డు లేనివారికి పదిహేను రోజుల్లో స్మార్డ్ కార్డు
* అన్న ఉనావగమ్ ప్రారంభం
* ప్రత్యేక నీటి పారుదల శాఖ
* వరదల నివారణకు 200 ప్రత్యేక చెక్ డ్యాములు
* మధ్యాహ్న భోజనంలో ఉచిత పాల పథకం
* అన్ని రకాల పరువునష్టం కేసులు వెనక్కి
* కుడాంకుళం ప్రాజెక్టుకు సంబంధించి పెట్టిన కేసులన్నీ రద్దు
* శాసన మండలి ఏర్పాటు
* విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్
* పాఠశాలల్లో అన్ని ఖాళీల భర్తీ
* నెలకు 20 కేజీల ఉచిత బియ్యం
* ప్రతి జిల్లాలో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు
* నాలుగో పోలీసు కమిషన్ ఏర్పాటు
* స్వచ్ఛ తమిళనాడుగా మార్పు
* జల్లికట్టు కొనసాగింపునకు కృషి
* పేదల గృహనిర్మాణాలకు రూ.3లక్షల సబ్సిడీ
* సబ్సిడీ ధరల్లో మొబైల్ ఫోన్లు