చాక్లెట్ దొంగతనం.. స్టూడెంట్ ప్రాణం తీసింది...
posted on Feb 17, 2020 @ 2:48PM
హైదరాబాద్ లోని వనస్థలిపురం డిమార్ట్ దగ్గర ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. నిన్న షాపింగ్ కి వెళ్లిన సతీష్(17) కి డిమార్ట్ సెక్యూరిటీకి మధ్య వివాదం చెలరేగింది. అసలేం జరిగిందంటే.. చాక్లెట్ దొంగతనం చేసినందుకు డీమార్ట్ సెక్యురిటీ సతీష్ అనే విద్యార్థిని గట్టిగా కొట్టడంతో ఒక్కసారిగా నేలకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అటు తల్లిదండ్రులు కొడుకు మృతితో బోరున విలపిస్తున్నారు.
తమ కొడుకును అన్యాయంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ వారు దాడి చేయడం వల్లే తన కొడుకు మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డిమార్ట్ దగ్గర ఆందోళనకు దిగిన మృతుడి బంధువులు అక్కడ అద్దాల్ని ధ్వంసం చేశారు. అంతేకాకుండా సతీష్ ను కాలేజీ యాజమాన్యం కూడా తమ పర్మిషన్ లేకుండానే బయటకు పంపారని అంటున్నారు. సతీష్ చావుకు డీమార్ట్ సిబ్బంది.. కాలేజీ యాజమాన్యమే బాధ్యత వహించాలి అని వెల్లడించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.