ఎగ్జిట్ పోల్ సర్వేలు: ఛీ కొట్టిన కాంగ్రెస్
posted on May 13, 2014 @ 3:19PM
సోమవారం నాడు వివిధ జాతీయ ఛానల్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయే అధికారంలోకి రాబోతోందని, యుపిఎ దుకాణం సర్దేయబోతోందన్న ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. దేశంలో 80 కోట్ల మంది ఓటర్లు వుంటే కేవలం లక్షమంది అభిప్రాయాలు కనుక్కుని ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ దేశంలోని ఓటర్లందరి మనోభావాలను ఎలా ప్రతిఫలిస్తాయని దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఈనెల 16వ తేదీన విడుదలయ్యేవే నిజమైన రిజల్ట్స్ అని దిగ్విజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు షకీల్ అహ్మద్ కూడా ఎగ్జిట్ పోల్స్ మీద స్పందించారు. 2004, 2009 సంవత్సరాల్లో కూడా ఇలాగే కాంగ్రెస్ వ్యతిరేక సర్వేలు ఇచ్చారని.. ఆ రెండు ఎన్నికలలోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఆయన గుర్తు చేశారు.