దిగ్విజయ్ సింగ్ ఇంటర్వ్యూ
posted on Dec 13, 2013 @ 4:10PM
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
1. రాష్ట్ర విభజనపై రాష్ట్రంలో అందరి అభిప్రాయము తీసుకొన్న తరువాతనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకొంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇరుప్రాంతల కాంగ్రెస్ నేతలు అంగీకరించారు కూడా. అందువల్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకొన్ననిర్ణయాన్నిపార్టీలో అందరూ బద్దులయి ఉండవలసిందే.
2. రాష్ట్ర విభజన బిల్లులోని ప్రతీ ఒక్క ఆర్టికల్ పై శాసనసభలోని ప్రతీ సభ్యుడు నిర్భయంగా తన అభిప్రాయలు తెలియజేయాలని కోరుతున్నాను. శాసనసభలో బిల్లుపై కేవలం అభిప్రాయ సేకరణ మాత్రమే జరుగుతుంది. ఓటింగ్ జగదు. సభ్యులు వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లును రూపొందిస్తాము.
3. హైదరాబాద్ పై పూర్తి హక్కులు తెలంగాణా ప్రభుత్వానిదే. పదేళ్ళ పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. ఇక్కడ నివసిస్తున్న ప్రజల ధనమానప్రాణాలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వమే వహిస్తుంది.
4. రాష్ట్ర విభజన పూర్తి రాజ్యాంగ బద్దంగా జరుగుతోంది. అందువల్ల ప్రతిపక్షాల విమర్శలకు నేను జవాబు ఈయనవసరం లేదు. బీజేపీకి మాట నిలకడలేదు. ఎప్పుడు ద్వంద వైఖరి అవలంభిస్తునే ఉంటుంది.
5. జగన్మోహన్ రెడ్డి డీ.యన్.ఏ.కాంగ్రెస్ డీ.యన్.ఏ. సరిపోలుతుందని నేను గతంలో అన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. జగన్ కూడా కాదనలేదు కదా?
6. చంద్రబాబు నేటికి తను ఏమి కోరుకొంటున్నారనే అంశంపై స్పష్టత లేదు. ఆయన నాపై ఎన్ని విమర్శలు చేసినప్పటికీ ఆయనంటే నాకు గౌరవమే.
7. జేసీ.దివాకర్ రెడ్డి కి త్వరలో షో కాజ్ నోటీసులు జారీ చేస్తాము.
8. ఇంతవరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన గురించి తన వాదనలు వినిపించేదుకు పార్టీ అవకాశం ఇచ్చింది. కానీ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి ఆయన కూడా తప్పనిసరిగా కట్టుబడి ఉండవలసిందే.
9. అన్నా హజారే వంటి మంచి వ్యక్తి పేరు ప్రతిష్టలను కొందరు తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని దురూపయోగం చేస్తున్నారు.
10. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలలో అభివృద్ధి జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. హైదరాబాదులో అనేక పెద్ద సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా సీమాంధ్ర ఏర్పడిన తరువాత అక్కడ కూడా అటువంటివి ఏర్పాటుకి పూర్తి సహకారం అందిస్తాము.
11. పోలవరం ప్రాజెక్టుకి అవసరమయిన నిధులు సమకూర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఈ ప్రాజెక్టులో మిగిలిన అంశాలపై కూడా కేంద్రం,ఏ పూర్తి బాధ్యత తీసుకొంటుంది.
12. రానున్న రెండు నెలలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేహ్సాలు నిర్వహిస్తుంది. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి నుండి పార్టీ కార్యకర్త వరకు అందరూ పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందించబడుతాయి. వాటిలో పాల్గొనేందుకు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అధిష్టానంలో పెద్దలు, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఆహ్వానింపబడుతారు.