తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
posted on Jul 1, 2025 8:18AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వేసవి సెలవులు ముగియడంతో భక్తల రద్దీ తగ్గింది. మంగళవారం (జులై 1) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇలా ఉండగా సోమవారం శ్రీవారిని 70 వేల 656 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 54 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ4 కోట్ల 20 లక్షలు వచ్చింది.