థర్డ్ వేవ్ వార్నింగ్ బెల్స్..
posted on Jul 14, 2021 @ 9:48AM
దాదాపు రెండు సంవత్సరాలు పాటు ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మొదటి వేవ్, రెండవ వేవ్ కొన్ని లక్షల మంది ప్రాణాలను కబళించి వేసింది.. ఇక మన దేశానికి వస్తే.. మొదటి వేవ్ అంతంగా మాత్రమే ఉన్న సెకండ్ వేవ్ మాత్రం విలయం సృష్టించిందని చెప్పవచ్చు.. ఇది ఇలాగ ఉంటే కరోనా కొద్దీ రోజులుగా కొంత ఉపశమనం ఇస్తుంది. ఇక రానున్న రోజులో థర్డ్ వేవ్ వస్తుందని. దానివల్ల అతిపెద్ద ముప్పు ఉందని చెపుతున్నారు. ఇక వాళ్ళు చెపుతున్న డెల్టా కరోనా అమెరికాలో పంజా విసురుతోంది. వ్యాక్సినేషన్ నెమ్మదించడంతో కరోనా కొత్త కేసులు మళ్లీ వేగంగా పెరిగిపోతున్నాయి. మూడు వారాల్లోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్ కారణమని నిపుణలు హెచ్చరిస్తున్నారు.
అమెరికాలో జూన్ 23నాటికి 11,300గా కరోనా కేసులు నమోదు కాగా.. సోమవారం రోజున రోజువారీ కరోనా కేసులు సగటున 23,600 కేసులు నమోదయ్యాయని Johns Hopkins University డేటా వెల్లడించింది. గత రెండు వారాల్లో మెయినే, సౌత్ డకొటా అనే రెండు రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు భారీగా పెరిగినట్టు పేర్కొంది. ఒకరకంగా చెప్పాలంటే డెల్టా వేరియంట్ అమెరికాని మని ఇప్పటికే వణికిస్తుంది. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
కానీ, వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడంతో డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 55.6 శాతం మంది అమెరికన్లకు కనీసం ఒక మోతాదు కరోనా వ్యాక్సిన్ అందించినట్టు డేటా తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో రెండు వారాల్లో తక్కువ వ్యాక్సినేషన్ రేటు నమోదైంది. అందులో మిస్సౌరీ, 45.9శాతం, అర్కాన్సాస్, 43శాతం, నెవాడా, 50.9శాతం, లూసియానా 39.2శాతం, ఉటా 49.5శాతంగా ఉన్నాయి.
డెల్టా వైరస్ తో పోరాడడానికి మళ్ళీ రెడీగా ఉండండి.. జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే విశాఖ పట్టణానికి చెందిన కెమికల్ ఇంజినీయర్ పరుచూరి మల్లిక్, డాక్టర్ ముఖర్జీ లాంటి వాళ్ళు థర్డ్ వేవ్ గురించి దాని ప్రభావం గురించి ఇప్పటికే చెప్పుకొచ్చారు.. కానీ ఇప్పటికే మన ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యాన్ని మరిచిపోయి దేశమంతటా లాక్ డౌన్ ఎత్తివేశారు.. ప్రజలు తమ పనుల రీత్యా ఉద్యోగం రీత్యా.. ఆర్థిక ఇబ్బందుల రీత్యా రోడ్డున ఎక్కారు.. మనల్ని మనమే కాపాడుకోవాలి.. అందుకే మీరు అందరు రెడీ గా ఉండండి..