ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో చార్జ్ షీట్ రెడీ !

 

 

 

ఈ నెల 16 వ తేదీన ఢిల్లీలోని ఓ బస్సులో దారుణంగా రేప్ కు గురి అయి ఆ తర్వాత మరణించిన యువతి కేసుకు సంభందించి దాదాపు వెయ్యి పేజీల చార్జ్ షీట్ ను సిద్దం చేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ కు చెందిన ఓ సీనియర్ అధికారి ప్రకటించారు. దీనిని న్యాయ నిపుణులు పరిశీలించిన అనంతరం వచ్చే గురువారం కోర్టుకు సమర్పిస్తామని ఆయన అన్నారు.


నిందితులందరికీ ఉరిశిక్ష వేయాలని తాము కోర్టును కోరతామని, బాల నేరస్తునిఫై ఉన్న అభియోగాలను బాల నేరస్తుల సదనానికి నివేదిస్తామని ఆ పోలీస్ అధికారి అన్నారు.


ఈ కేసుకు సంభందించి ఇప్పటివరకూ 30 మంది సాక్ష్యాలను ఇందులో పొందుపరచామని ఆయన వివరించారు. ఇందులో ఆమెకు వైద్య చికిత్స చేసిన వైద్యులు కూడా ఉన్నారు. ఈ సంఘటనలో ఆమెతో పాటు దాడికి గురి అయిన ఆమె బాయ్ ఫ్రెండ్ సాక్ష్యం నిందితులకు శిక్షను ఖరారు చేయడంలో కీలకం కాబోతోంది. అలాగే, ఆమె వాంగ్మూలం కూడా. అత్యాచార ఘటన జరిగిననాటినుండి ఆమె మరణించే వరకూ జరిగిన చోటు చేసుకున్న సంఘటనలను అన్నింటినీ ఈ చార్జ్ షీట్ లో పెర్కొన్నామని ఆ అధికారి అన్నారు.

Teluguone gnews banner