ఢిల్లీ గ్యాంగ్ రేప్: సోనియా హామీ, ఉరిశిక్ష పై ..!

 

 

 

ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఉదంతంఫై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆందోళనకారులకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. గత రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆమె తన నివాసం నుండి బయటకు వచ్చి, ఆందోళనకారులతో సుమారు అరగంట సేపు మాట్లాడారు. ఈ సంఘటనలో నిందితులఫై ఎలాంటి చర్యలు తీసుకుంటారని వారు సోనియాను ప్రశ్నించారు. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు తానేమీ చెప్పలేనని, అయితే బాధితురాలికి మాత్రం తాను అండగా ఉంటానని అన్నారు.

 

మరో వైపు ఢిల్లీ లో ఆందోళనకారులు తమ నిరసన ప్రదర్సనలు కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్త్రపతి భవన్, ఇండియా గేట్, విజయ చౌక్ వంటి చోట్ల పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో విద్యార్దులు ఆయా ప్రాంతాల్లో తమ ఆందోళన కార్యక్రమాలను చేస్తున్నారు. ఈ ఆందోళనలతో కేంద్రం దిగి వచ్చినట్లు కనిపిస్తోంది. సోనియా, మన్మోహన్ సింగ్ లతో చర్చిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ నిందితులకు మరణ శిక్ష పడేలా చూస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. క్రిమినల్ లా కు తక్షణ సవరణ చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తామని షిండే అన్నారు.

 

ఉరి శిక్ష ఫై పార్లమెంట్ ఉభయ సభల్లో ఇప్పటికే చర్చించామని, ఈ విషయంలో మరింత చర్చ అవసరమని మంత్రి వ్యాఖ్యానించారు. రేప్ ఘటనఫై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని, ఇటువంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని షిండే అన్నారు. అయితే, విద్యార్దులఫై లాఠీ చార్జ్ వంటి సంఘటనల పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు.

Teluguone gnews banner