వాట్సప్ చాట్ డీకోడ్.. ఇక అరెస్టేనా?
posted on Mar 11, 2023 @ 11:31AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ కవితను విచారిచడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దేశం మొత్తం దృష్టి ఇప్పుడు కవితను ఈడీ అరెస్టు చేస్తుందా? చేయదా అన్న అంశంపైనే ఉంది. కాగా ఈడీ కూడా కవిత విచారణకు ముందు చాలా పకడ్బందీగా ఈ కుంభకోణంలో ఆమె ప్రమేయానికి సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించిందని కూడా అంటున్నారు.
కవితను విడిగా విచారించడమే కాకుండా.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టై ఉన్న ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా, మనీష్ సిసోడియా, అరుణ్ పిళ్లై, దినేష్ ఆరోరా, బుచ్చిబాబు, మనీష్ సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, మాజీ అధికారులు కులదీప్ సింగ్, నరేంద్ర సింగ్ లతో కలిపి విచారిస్తోందనని తెలుస్తోంది.
వీరంతా కూడా తమతమ సెల్ ఫోన్ లను ధ్వంసం చేసిన వారేనని ఈడీ చెబుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కుంభ కోణం వ్యవహారంలో వీరు కోడ్ భాషలో వాట్సాప్ చాటింగ్ చేశారన్న విషయాన్ని గుర్తించిన ఈడీ ఆ కోడ్ ను కూడా డీ కోడ్ చేయగలిగిందని అంటున్నారు. దీంతో పక్కా సాక్ష్యాధారాలతో ఆమె అరెస్టుకు ఈడీ రంగం సిద్ధం చేసిందని పరిశీలకులు అంటున్నారు.
ఈ కుంభకోణంలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వారంతా తమ ఐఫోన్లను ధ్వంసం చేశారని, అందులో ఉన్న సమాచారాన్ని మొత్తం క్రోడీకరిస్తే కీలక విషయాలు తెలిసాయని ఈ డి అంటోంది. వాటి ఆధారంగానే కవిత, మిగతా తొమ్మిది మందిని ఒకేసారి ఈడి అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.