నాలుగు సర్వేలు.. బీజేపీకే ఫేవర్...
posted on Feb 5, 2015 @ 10:15AM
ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం నాటితో ప్రచారం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి రకరకాల సర్వేలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేల్లో ఎక్కువ శాతం సర్వేలు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం వుందని స్పష్టంగా చెప్పాయి. నాలుగు కీలకమైన సర్వేలు బీజేపీకి అధికారం ఖాయమని చెప్పాయి. అయితే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ చేయించుకున్న సొంత సర్వే మాత్రం ఆయన పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పింది. ఎవరు చేయించుకున్న సర్వే వారికే అనుకూలంగా ఉండకుండా ఎలా వుంటుంది. అయితే ఇండియా టుడే చేసిన సర్వే కూడా ‘ఆప్’కి అనుకూలంగా ఉండటం విశేషం. ఇదిలా వుంటే ఇండియా టీవీ - సీ ఓటర్ జరిపిన సర్వే, వీక్ - ఐ, ఎంబీఆర్, ఐబీఎన్ 7 జరిపిన సర్వేల్లో తేలింది. జీటీవీ సర్వే కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే వచ్చింది.