అమరావతిలో దీక్షా శిబిరాల ముగింపు... కూటమి ఘన విజయంతో రైతుల కళ్లల్లో ఆనందబాష్పాలు
posted on Jun 5, 2024 @ 1:00PM
పదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్ కు ఇంత వరకు పర్మినెంట్ రాజధాని నిర్మించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. అమరావతి రాజధాని కల సాకారం కానుంది. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక ఊపిరి పీల్చుకునే రోజులు వచ్చాయి. ఐదేళ్లుగా రాజధాని నినాదాలతో హోరెత్తిన
అమరావతి ప్రాంతమంతా చల్లబడనుంది..అక్కడి దీక్షా శిబిరాలను ఎత్తివేస్తున్నట్లు దీక్షా శిబిరాల నిర్వాహకులు తెలిపారు
2019 డిసెంబర్ 17న జగన్ మూడు రాజధానుల ప్రకటన చేయడంతో అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారుఎన్నో రకాలుగా ఆందోళనలు చేసినా,కోర్టుకెళ్లినా వైసిపి ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. కూటమికి నాయకత్వం వహించిన తెలుగు దేశం పార్టీకి జనసేన నేత పవన్ కళ్యాణ్ పూర్తి సంఘీ భావం ప్రకటించారు. కౌంటింగ్ ఫలితాల్లో కూటమి భారీ మెజారిటీ సాధించడం వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో అమరావతి రైతులంతా సంబరాలు చేసుకుని ఉద్యమాన్ని విరమించారు..