లవర్ కోసం తండ్రిని చంపించిన కూతురు.. హైదరాబాద్ లో కిరాతకం..
posted on Nov 13, 2021 @ 2:01PM
హైదరాబాద్ లో దారుణం జరిగింది. తన లవర్ కోసం కన్న తండ్రిని కిరాతకంగా చంపేసింది కూతురు. ఇందుకు ఆమె లవర్ ఫ్రెండ్స్ సాయం చేశారు. మర్డర్ విషయం తల్లికి తెలిసినా.. ఒక్కతే కూతురు కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మౌనంగా ఉండిపోయింది. అయితే పోస్ట్ మార్టమ్ రిపోర్టులో మర్డర్ కేసు బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు కుషాయిగూడ పోలీసులు.
కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాప్రాలో నివసించె పల్సమ్ రామకృష్ణ అనే తన భార్య, కూతురితో కలిసి నివసిస్తూ గ్యాస్ ఏజెన్సీలో వర్కర్గా పనిచేస్తుండే వాడు. అయితే వీళ్లు ఇంతముందు నారాయణకూడలో నివసిస్తుండేవారు. నారాయణగూడలో నివసించె సమయంలో వాచ్మెన్ కొడుకుతో తన కూతురు సన్నిహితంగా ఉండడం గమనించాడు రామకృష్ణ. రామకృష్ణ కూతురు వాచ్మెన్ కొడుకు భూపాల్కి తన ఇంటి అల్మారాలో ఉన్న డబ్బును ఇచ్చింది. ఆ డబ్బుతో అతను బైక్, కెమేరా, డ్రస్లు కొనుకున్నాడు. విషయం తెలుసుకున్న రామకృష్ణ.. భూపాల్ కు వార్నింగ్ ఇచ్చాడు. అయినా భూపాల్ మారకుండా ఉండడంతో మైనర్ అయిన తన కూతురిపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని నారాయణగూడ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దానితో పోక్సో ఆక్ట్ కింద నిందితుడు భూపాల్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
ఈ ఏడాది జులైలో జైలు నుండి విడుదలైన భూపాల్ బుద్దిమార్చుకోకుండా ఆమెను మళ్లీ కలవడం మొదలు పెట్టాడు. తన ఫ్రెండ్స్తో కలిసి ఓ ప్లాన్ వేశాడు. జూలై 19న సాయంత్రం రామకృష్ణ ఇంటి సమీపానికి వెళ్లి స్లీపింగ్ పౌడర్ రామకృష్ణ కూతురికి ఇచ్చాడు. దానిని ఆమె వారు తింటున్న చికెన్ కర్రీలో కలిపింది. అది రామకృష్ణ, తల్లి, అన్న తిని నిద్రలోకి జారుకున్నారు. అర్థరాత్రి 1 గంటల సమయంలో భూపాల్తో పాటు అతని ముగ్గురు ఫ్రెండ్స్ ఇంటిలోకి వచ్చారు. భూపాల్ అతని ఫ్రెండ్ గణేష్లు నిద్రపోతున్న రామకృష్ణ బ్లాంకెట్తో నోరు మూసి, గొంతుపై కత్తితో దాడి చేశారు. అలజడి కావడంతో రామకృష్ణ భార్య, కొడుకు లేచి చూశారు. అప్పటికే అపస్మారక స్థతిలో ఉన్న రామకృష్ణను హాస్పిటల్ తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే చనిపోయాడని చెప్పారు.
బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. అయితే పోస్ట్మార్టం రిపోర్ట్లో రామకృష్ణ ప్రమాదవశాత్తు చనిపోలేదని, ఎవరో కావాలనే హత్య చేసి చంపారని రిపోర్ట్ వచ్చింది. దీంతో బాధితురాలిని పిలిచి పోలీసులు విచారించగా అసలు నిజం బయటపడింది, తనకున్న ఒక్కగాను ఒక్క కూతురిని కాపాడుకోడానికి అలా చెప్పిందని జరిగిన ఘటన పూర్తి వివరాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుమేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రామకృష్ణ కూతురుతో ప్రధాన నిందితుడు భూపాల్, అతని నలుగురు స్నేహితులను అరెస్ట్ చేశారు.