ఎమ్మెల్సీ ఎంపిక పై దాడి అసంతృప్తి
posted on Mar 10, 2013 @ 5:00PM
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సీటు ఇవ్వనందుకు ఆయన అసంతృప్తికి గురయ్యారు. యనమలకు సీటు ఇవ్వడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, పార్టీలో సీనియర్‌నైన తాను మరోమారు కొనసాగింపు కోరుకోవడంలో తప్పు లేదని, అయితే ఈసారి ఎమ్మెల్సీ పదవి తనకు ఇవ్వడం లేదని ముందుగా చెప్పి వుంటే గౌరవంగా తప్పుకునేవాడినని దాడి అన్నారు. పొలిట్ బ్యూరో సమావేశంలో చెప్పడం మనస్తాపానికి గురైనట్లు చెప్పారు.
పార్టీలో బీసీలకు, పేదలకు న్యాయం జరగలేదని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేసే పద్ధతి ఇదేనా అంటూ ఆయన ప్రశ్నించారు. నిబద్ధత గల కార్యకర్తగా టీడీపీలో పనిచేస్తానని అన్నారు. కాగా బీసీ డిక్లరేషన్‌ను టీడీపీ ఆదివారం ప్రకటించింది. దాడి వీరభద్రరావు పదవి కాలం ఇంకా రెండు నెలల సమయం ఉన్నా మనస్తాపం కారణంగా ఇప్పుడే రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.