అప్పులతో కిడ్నీలు అమ్ముదామని దంపతులు.. సైబర్ నేరగాళ్ల చేతిలో 48 లక్షలు మోసం..
posted on Jul 14, 2021 @ 12:23PM
ఓపెన్ చేస్తే.. అది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉండే దంపతులు.. ఆ దంపతుల పేర్లు మోది వెంకటేశ్, లావణ్య లు. ఖైరతాబాద్ లో స్థానికంగా స్టేషనరీ, బ్యాంగిల్ స్టోర్ రన్ చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తూ.. కాస్తో కూస్తో చంపాదించిన డబ్బులతో రెండేళ్ల క్రితం సొంతగా ఇళ్లు కట్టుకునేందుకు పనులు ప్రారంభించారు. ఇందుకు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ద్వారా మొదట రూ.34 లక్షలు, తర్వాత మరో రూ.10 లక్షలు లోన్ తీసుకున్నారు. ఇల్లు రెడీ అయ్యేసరికి దాదాపు రూ.1.50 కోట్ల అప్పులయ్యాయి. గత రెండు సంవత్సరాల నుండి కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో వ్యాపారం దాదాపు మూతపడింది. అవసరాలు, అప్పులు పెరుగుతున్నాయి. మరోవైపు అప్పులిచ్చినవారి నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. అప్పులు చేయకూడదు ఆ అప్పులు ఎప్పటికి ముప్పు అని అనుకున్నారు. అయినా సరే వాళ్ళను నమ్మి అప్పులిచ్చిన వారికి ఎలాగైనా తిరిగివ్వాలని ఫిక్స్ అయ్యారు ఆ భార్యాభర్తలిద్దరూ.. అందుకోసం వింటేనే గుండె తరుక్కుపోయే పని చేశారు. తమ కిడ్నీలు అమ్ముకోవడానికి సిద్దపడ్డారు.
గూగుల్‌లో సెర్చ్ చేసి బుక్కయ్యారు….
కిడ్నీలు అమ్ముకోవాలి అనుకున్న ఆ దంపతులు. ఆ కిడ్నీలు కొనేవారు ఎవరో ఎక్కడ ఉంటారో తెలియక.. ఆ దంపతులు గూగుల్‌లో సెర్చ్ చేశారు. వీళ్ళ అవసరాన్ని పసిగట్టి మొదట ఓ వ్యక్తి పరిచయమై.. ముందు రిజిస్ట్రేషన్ ఫీజు కడితే చాలన్నాడు. ఆ తర్వాత కిడ్నీకి బీమా, కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ల కోసమంటూ మొత్తం రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా అతనికి మరిన్ని డబ్బులు ఇవ్వలేక వెంకటేష్ మరో వ్యక్తిని సంప్రదించారు. అతనూ రూ.12 లక్షల వరకు గుంజేశాడు. ఇలా మొత్తం నలుగురిని ఆన్‌లైన్‌లో సంప్రదించారు. ఓ వ్యక్తి కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు కడితే రావాల్సిన మొత్తంలో సగం అకౌంట్లలో వేస్తానని నమ్మించాడు. చెప్పినట్లే రెండు ఖాతాల్లో డబ్బులు జమైనట్లు కనిపించాయి. రెండు, మూడు రోజుల్లో ఆ డబ్బులు తీసుకోవచ్చని చెప్పాడు. కానీ, విత్‌డ్రా చేద్దామంటే అవ్వట్లేదు. అతన్ని తిరిగి సంప్రదించగా.. ఆర్థికశాఖ, ఎయిర్‌ఫోర్స్ అథారిటీ, ఐటీ శాఖ సర్టిఫికెట్లు అవసరమంటూ డబ్బులు కట్టించుకున్నాడని బాధిత దంపతులు కంప్లైంటులో పేర్కొన్నారు. మోసపోవడానికి కూడా ఒక హద్దు ఉంటుందని తెలుసుకోలేకపోయారు. వెంకటేష్ కు సైబర్ మోసగాళ్లు మాయమాటలు చెప్పి రూ.40.38 లక్షల వరకు కాజేశారు. ఈ సమాజంలో ఒకటి జీవితం అంటే మరొకడికి లెక్కలేకుండా పోయింది.. వెంకటేష్ ధర్మం కోసం అప్పు ఇచ్చిన వాళ్లకి తిరిగి ఇవ్వాలని తన ప్రాణాలు పణంగా పెట్టి కిడ్నీలు అమ్మి వాళ్ళ అప్పు తీర్చాలనుకున్నాడు.. అయినా సైబర్ నేరగాళ్లు వాళ్ళని కనికరించలేదు.. అలా అని ధర్మం కోసం నిలబడుదామన్న వెంకటేష్ కి దేవుడు కూడా అండగా నిలవలేదు..
దొంగ నోట్లు ఇచ్చి.. ముంచేశారు..
మరో వ్యక్తి డబ్బులు తీసుకునేందుకు బెంగళూరుకు వస్తే.. తమ మనుషులు అడ్వాన్స్ చెల్లిస్తారని చెప్పాడు. అప్పటికి తాము మోసమోతున్నాం అని గ్రహించలేకపోయారు.. అంటే వాళ్ళ కళ్ళ ముందు అప్పులోళ్లు కనిపిస్తున్నారు గాని.. తమ్ము మోసపోతున్నాం అని తెలుసుకోలేకపోయారు. చివరికి అది నిజమేనని నమ్మి వారు అక్కడికి వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు హోటల్‌కు వచ్చి లాకర్ తెరిచి డబ్బులు చూపించారు. నోట్లు నలుపు రంగులో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించగా.. ఇదంతా ఆర్‌బీఐ డబ్బు అని, రసాయనాలతో క్లీన్ చేయాల్సి ఉంటుందని నమ్మించారు. కొన్నింటిని శుభ్రం చేసి చూపించారు. వాటిని ఓ ప్యాకెట్‌లో కట్టి ఇచ్చి.. 48 గంటల వరకు తెరవకూడదన్నారు. ముంబై నుంచి రసాయనాలు తెప్పించాలంటూ వారు డబ్బులు కట్టించుకున్నారని, ఇందుకు తెలిసినవారి దగ్గర బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు దంపతులు వెల్లడించారు. తీరా హైదరాబాద్‌కు వచ్చాక ప్యాకెట్ తెరిచిచూస్తే అవన్నీ దొంగ నోట్లని తెలిసిందని వారు వాపోయారు.