నోట్లో పడ్డ ఆకు ఉమ్మినందుకు రూ.30 వేల జరిమానా
posted on Dec 16, 2025 @ 1:04PM
బ్రిటన్‌లో చట్టాలు పకడ్బందీగా అమలు చేస్తున్నామని అధికారులు చెప్పుకుంటుంటే.. తాజాగా బ్రిటన్‌లో చట్టాల అమలు తీరుపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. స్థానికంగా నివసించే 86 ఏళ్ల రాయ్ మార్ష్.. తన నోట్లోకి గాలికి వచ్చి పడిన ఒక ఆకును ఉమ్మేసినందుకు గానూ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏకంగా 30,337 రూపాయలు జరిమానా విధించడం సంచలనం సృష్టించింది. గ్రేట్ బ్రిటన్‌లో ఆస్థమాతో బాధపడుతున్న వృద్ధుడిని ఏమాత్రం కనికరం చూపకుండా వేధించారని ఆయన కూతురు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ పోరాటం తర్వాత ఫైన్ తగ్గించినా, ఇటువంటి చిన్న చర్యలకు భారీ జరిమానాలు విధిస్తున్న లింకన్‌షైర్ కౌన్సిల్‌పై ప్రజలు మండిపడుతున్నారు.
సాధారణంగా ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గాలికి కొట్టుకొస్తూ.. ఒంటిపై, ముఖంపై దుమ్మూ ధూళి పడుతుంటాయి. ఒక్కోసారి చెత్తాచెదారం కూడా కొట్టుకొస్తూ నోట్లోనూ పడుతుంటుంది. అలా ఎండిపోయిన ఆకులో, కాగితాలో వచ్చి నోట్లో చేరితే వెంటనే మనం ఉమ్మేస్తుంటాం. ఇదంతా అందరూ చేసేదే. దీంట్లో పెద్ద తప్పేమీ లేదు. కానీ ఇదే పని చేసినందుకు ఓ 86 ఏళ్ల వృద్ధుడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.36 వేల జరిమానా విధించారు బ్రిటన్ అధికారులు. గాలికొచ్చిన ఆకు నోట్ల పడ్డందుకు ఉమ్మినందుకే ఇంత జరిమానా వేయడం తీవ్ర విమర్శల పాలవుతోంది.
బ్రిటన్‌లో చట్టాన్ని అతిగా అమలు చేసిన ఆ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 86 ఏళ్ల వృద్ధుడు రాయ్ మార్ష్.. తన నోట్లోకి గాలికి వెళ్లిన ఒక ఆకును ఉమ్మేసినందుకు గానూ స్థానిక అధికారులు ఏకంగా 250 పౌండ్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.30,337) జరిమానా విధించారు. న్యాయ పోరాటం తర్వాత జరిమానా 150 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.18,202) తగ్గించినప్పటికీ.. ఈ నిర్దోషి చర్యకు భారీ మూల్యం చెల్లించుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.