సీఆర్డీయే ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం 13న
posted on Oct 6, 2025 @ 3:19PM
ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ ఆథారిటీ (సీఆర్డీయే) ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 13న ప్రారంభించనున్నారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. దీంతో ఇంకా అరకొరగా మిగిలి ఉన్న పనులను అక్టోబర్ 13 ముహూర్తం నాటికి పూర్తిచేయడానికి అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తొలుత ఈ కార్యాలయాన్ని స్వాతంత్ర్యదినోత్సవం నాడు అంటే ఆగస్టు 15న ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే దానిని వాయిదావేసి దసరాకు ప్రారంభించాలని తేదీ ప్రకటించారు. అయితే అప్పట్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, నాణ్యతా పరీక్షలలో జాప్యం కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా అక్టోబర్ 13న ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేశారు. అమరావతి నిర్మాణం, ప్రణాళిక విభాగాలు, మునిసిపల్, హెవోడీ కార్యాలయాలూ అన్ని ఒకే చోటనిర్మాణం, ప్రణాళిక అన్నీ ఈ సీఆర్డీయే కార్యాలయ భవనంలోకి వచ్చేస్తాయి. 3లక్షల చదరపు అడుగులకు మించిన విస్తీర్ణంవిస్తీర్ణంలో ఉంది.
వాస్తవానికి ఈ కార్యాలయ భవనం 2014-2019 మధ్యలోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కాలేదు. జగన్ హయాంలో ఈ నిర్మాణ పనులు మూలన పడేసింది. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాతనే సీఆర్డీయే ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం జోరందుకుంది. ఈ కార్యాలయం కేంద్రంగానే కమాండ్ కంట్రోల్ రూమ్ సహా రాజధాని ప్రాంతంలోని అన్ని కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టుల పర్యవేక్షణా సాగుతుంది.