కరోనా కాటుకు.. 594 మంది డాక్టర్స్ బలి..
posted on Jun 2, 2021 @ 11:54AM
ఇందు గలడందులేడని సందేహం కలదు ఎందెందు చూసిన అందందే గలడు అన్నట్లు ప్రపంచం మొత్తం ఎక్కడ చూసిన కరోనా విస్తరించింది. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, యువకులు అని తేడాలేకుండా. భారత దేశంలో సమన హక్కు ఉందో లేదో తెలియదు గానీ, కరోనా మాత్రం అందరికి సమాన హక్కు కలిపించి వారి వారి ప్రాణాలను కరోనా కౌగిలో బంధించింది, విలయతాండవం చేసింది. ఒక్క సారిగా ప్రపంచాన్ని మొత్తం కుదిపేసింది. ఇక వివరాల్లోకి వెళితే..
కూడా కరోనా టైం లో ఫ్రాంట్ లైన్ యుద్ధ వారధులుగా ఉండి, తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా. అనునిత్యం అనితరమైన సేవలు అందించిన వారు డాక్టర్స్ అని చెప్పలి. అయితే కరోనా వైరస్ వైద్యం చేయడం తో పాటు, కరోనా కాటుకు వాలు కూడా బలయ్యారు. కరోనా మామూలు జనాల చెలగాటం ఆడడంతో పాటు, డాక్టర్స్ ని కూడా చెడుగుడు ఆడేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ లో దేశంలో దాదాపు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు డాక్టర్స్.
దేశవ్యాప్తంగా కరోనాతో 594 మంది డాక్టర్లు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరణించిన వారి వివరాలను తన నివేదికలో ప్రచురించింది. ఢిల్లీలో అత్యధికంగా 108 డాక్టర్లు చనిపోగా... బీహార్‌లో 98 మంది, యూపీలో 67 మంది మరణించారని పేర్కొంది. రాజస్థాన్‌లో 43, ఝార్ఖండ్‌లో 39, ఏపీ 32, తెలంగాణలో 32, తమిళనాడులో 21, మహారాష్ట్రలో 17, మధ్యప్రదేశ్‌లో 16 మంది డాక్టర్లు కోవిడ్‌తో మరణించారు. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు ఐఎంఏ వెల్లడించింది. కోవిడ్‌తో ఎవరైనా చనిపోతే వారి కుటుంబసభ్యులు డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులు పాల్పడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి హింసాత్మక ఘటనల మధ్య విధులు నిర్వహించేందుకు డాక్టర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలను అరికట్టేందుకు పటిష్ట చట్టం రూపొందించాలని కేంద్రాన్ని కోరింది.