కరోనా కలకలం.. కర్ఫ్యూ
posted on Mar 27, 2021 @ 3:17PM
కరోనా సెకండ్ వేవ్ ఇన్నింగ్ ఊపందుకుంది. దాని కారణంగా ఈ ఆదివారం నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు రానుంది. మాల్స్‌ని రాత్రి 8 గంటలకే కట్టేయాలని ఆదేశించారు. రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పుంజుకోవడంతో కర్ఫ్యూ కి మించిన మార్గం మరొకటి కనిపించట్లేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కార్యాలయం తెలిపారు. రోజూ రాత్రి 8 గంటలకు మూతపడే షాపింగ్ మాల్స్ మార్నింగ్ 7 గంటల తర్వాత తెరచుకుంటాయి. ప్రజలు గనక కరోనా రూల్స్ విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉద్ధవ్ థాక్రే హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నపళంగా లాక్‌డౌన్ తెచ్చే ఉద్దేశం లేదని.. రాష్ట్రంలో ఎక్కడెక్కడ లాక్‌డౌన్ పెట్టాలో.. జిల్లాల కలెక్టర్లు, అధికారులు డిసైడ్ చేస్తారని ఆయన అన్నారు. ప్రజలకు ముందుగా నోటీస్ ఇచ్చాకే లాక్‌డౌన్ తెస్తామని అన్నారు. మహారాష్ట్రలో లాక్‌డౌన్ రావడం ఖాయం అని అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రములో కేసులు ఊపు అందుకున్న నేపథ్యంలో ఆస్పత్రులకు వచ్చే పేషెంట్ల సంఖ్య కూడా ఎక్కువైయిందని. దాంతో మరిన్ని బెడ్లు, మందులు రెడీ చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 36,902 కరోనా కేసులు వచ్చాయి. కరోనా టైం స్టార్ట్ అయినప్పటి నుండి ఒకే రోజులో ఇన్ని కేసులు పెరగడం ఇదే మొదటిసారి. నిన్న ఏకంగా 112 మంది మృతిచెందారు. రాష్ట్రంలో జస్ట్ 5 డేస్లో 1.3 లక్షల కరోనా కేసులు వచ్చాయి. ముంబైలో ఇప్పటివరకు ఒకే రోజు 5,504 కరోనా కేసులు రావడం అత్యధికం. ఆ రికార్డు శుక్రవారం చెరిగిపోయింది. కొత్త రికార్డుగా 5,513 కేసులు వచ్చాయి.
దేశంలో లాక్‌డౌన్ ఎత్తేశాక... ప్రజలు కొన్ని నెలల పాటూ కరోనా జాగ్రత్తలు తీసుకున్నరని.. ఎప్పుడైతే వ్యాక్సిన్ పంపిణీ మొదలైంతో... అప్పటి నుంచి ప్రజల్లో ధైర్యం పెరిగింది. ఇక కరోనా పని కతం అనుకుంటూ... మాస్క్, సోషల్ డిస్టాన్స్ పాటించకుండా, శానిటైజర్ల వాడకం దాదాపు ఆగిపోయిందని. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకుతుంది అనే వాస్తవాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో రాష్ట్రాలు ఫెయిల్ అయ్యాయి. ఫలితంగా మళ్లీ కరోనా పెరిగిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.