Read more!

షర్మిల పాదయాత్రకు హైకోర్టు ఓకే.. బట్ కండీషన్స్ అప్లై

ఇప్పటి వరకూ వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ఎలాంటి ఆంక్షలూ, అడ్డంకులూ లేకుండా తెలంగాణలో పాదయాత్ర సాగిస్తూ వచ్చారు. అయితే సోమవారం(నవంబర్ 29) వరంగల్ జిల్లా నర్సంపేట వద్ద ఆమె యాత్రను అడ్డుకోవమే కాకుండా పోలీసులు ఆమె యాత్రకు అనుమతి రద్దు చేశారు. దీంతో మూడు వేల కిలోమీటర్లకు పైగా నిరాటంకంగా నడిచేసిన షర్మిల నడకకు బ్రేక్ పడినట్లైంది.

దీంతోనే వైఎస్సార్ టీపీ నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పాదయాత్రకు టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డంకులు సృష్టించారని పిటిషన్ లో పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ ను విచారించి షర్మిల యాత్రకు అనుమతి ఇస్తూ తీర్పు వెలువరించింది.

అదే సమయంలో షర్మిలకూ కొన్ని కండీషన్లు పెట్టింది. సీఎం కేసీఆర్ పై ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలూ చేయరాదని షరతు విధించింది. అలాగే షర్మిల పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులూ సృష్టించవద్దని పోలీసులను ఆదేశించింది.