మద్యం డబ్బుల కోసం.. కన్నబిడ్డల్నే అమ్మేసిన దంపతులు.
posted on Jul 30, 2021 @ 4:16PM
రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే.. బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే.. తళ తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు. పెళ పెళ పెళ లాడే నోటు పెంచును వెయిటు. ఈ ప్రపంచంలో అన్ని మనిషి చుట్టూ తిరిగితే మనిషి మాత్రం డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. మనుషులు వారి అలవాట్లు తీర్చుకోవడానికి డబ్బులు కావలి అలాగే ఆ డబ్బుల కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా మద్యానికి బానిసైన భార్యభర్తలు డబ్బుల కోసం ఇద్దరు బిడ్డల్ని అమ్ముకున్న దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మూడో బిడ్డను కూడా అమ్మకానికి పెట్టేందుకు ప్రయత్నించగా బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని ఊటీ కాందల్ భగవతి అమ్మవారి ఆలయ వీధికి చెందిన రాబిన్ (29), మోనీషా (26) కొన్నా్ళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
కొద్ది నెలలుగా దంపతులిద్దరూ మద్యానికి బానిసయ్యాడు. ఆ మద్యానికి బానిసై మద్యం మత్తులో దొరికిన చోటల్లా అప్పులు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు కూడా కూలిపోయింది. అప్పటి నుండి కుటుంబ పోషణ భారమైంది. ఇక ఆ తల్లిదండ్రులు చేతులు ఎత్తేశారు. పిల్లల్ని పోషించలేక మూడేళ్ల వయసున్న పెద్ద కుమార్తెను మోనీషా సోదరి ప్రవీణకు అప్పగించారు. రాబిన్ మిత్రుడి సాయంతో తిరుప్పూర్‌కు చెందిన నిసార్‌బాయ్‌కి రెండో కుమార్తెను(18 నెలలు) రూ.25 వేలకు విక్రయించారు. కుమారుడి (3 నెలలు)ని సేలం ప్రాంతానికి చెందిన భూపతి-ఉమామహేశ్వరి దంపతులకు ఏకంగా రూ.30 వేలకు అమ్మారు.
ఈ క్రమంలో పెద్ద కుమార్తెను కూడా విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు రోజుల క్రితం ప్రవీణ వద్దకెళ్లి తమ బిడ్డను ఇచ్చేయాలని గొడవకు దిగారు. దీంతో ఆమె ఆమె పిల్లల సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాబిన్ దంపతులను విచారించగా మిగిలిన ఇద్దరు పిల్లలని అప్పటిక విక్రయించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు రాబిన్ దంపతులతో పాటు పిల్లల్ని కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది.