భారత్ కు చిన్న ఊరట.. భారీగా తగ్గిన కొత్త కరోనా కేసులు..
posted on Oct 27, 2020 @ 11:21AM
దేశంలో నిన్న కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో జస్ట్ 36,470 మాత్రమే నమోదయ్యాయి. ఒకప్పుడు రోజుకు లక్ష దాకా వచ్చేవి. ఇప్పుడు ఇంతలా తగ్గిపోవడం చిత్రమే. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 79,46,429కి చేరింది. దేశంలో నిన్న 488 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,19,502కి చేరింది. ఇండియాలో మరణాల రేటు 1.5 శాతం ఉండగా... ప్రపంచ దేశాల్లో అది 2.66 శాతంగా ఉంది. గత 24 గంటల్లో ఇండియాలో... కరోనా నుంచి 63,842 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 72,01,070కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 6,25,857 ఉన్నాయి.
అయితే గత 24 గంటల్లో నమోదైన కేసులను గమనించినట్లయితే హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, పంజాబ్, బెంగాల్ రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు తగ్గుతున్నాయి.