మళ్లీ డాక్టర్లపై కరోనా బాధితుల దాడి!
posted on Apr 14, 2020 @ 7:34PM
మొన్న గాంధీలో..నేడు ఉస్మానియాలో మళ్లీ డాక్టర్ల పై కరోనా భాదితులు దాడికి దిగారు. ఉస్మానియా లోనూ అదే సీన్ రిపీట్ అయింది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో రెండు పాజిటివ్ కేసులు ఉన్నాయి. అనుమానితులను, రోగులను ఒకే చోట ఉంచడంపై అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఐసోలేషన్ వార్డులో ఉన్న పీజీలపై కరోనా బాధితులు దాడి చేసినట్టు వార్తలు భగ్గుమన్నాయి. కరోనా బాధితులు ఎవరూ సహనం కోల్పోకూడదని - అందరూ సంయమనం పాటించాలని ఎవరు ఎంతగా చెప్పినా బాధితులు సహనం కోల్పోయి వ్యవహరిస్తున్నారు. దాడులకు దిగుతున్నారు.
డాక్టర్లు దైవంతో సమానమని - వారిని ఇబ్బంది పెట్టవద్దని సీఎం చెప్పినా కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. డాక్టర్ల పై దాడికి దిగితే ..వారు చేతులెత్తేస్తే మనల్ని కాపాడేవారే లేరు అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని మెలిగితే మంచిది. మరో ప్రక్క కరోనావైరస్ హైదరాబాద్‌లోనూ విజృంభిస్తుంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయి. దీనితో ప్రజలలో అలజడి మొదలైంది.
డాక్టర్లు - పోలీసులు - అధికారులు ప్రాణాలని పణంగా పెట్టి కరోనా పై యుద్ధం చేస్తున్నారు. అయితే అక్కడక్కడా పోలీసులు - డాక్టర్ల పై కరోనా భాదితులు దాడికి దిగుతున్నారు.గాంధీ హాస్పిటల్ లో కరోనా రోగులు వైద్యులపై దాడికి దిగితే ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ లోనూ అదే సీన్ రిపీట్ అయింది.