తెలంగాణా పోలీస్‌పై కరోనా పంజా!
posted on Apr 7, 2020 8:55AM
హైదరాబాద్ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. సైఫాబాద్ పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ స్టేషన్లో పని చేసే 12 మంది సిబ్బందిని క్వారంటైన్‌కి పంపారు.
అయితే బాధితుడికి ట్రావెల్ హిస్టరీ లేదు. ఆయన ఎక్కడా ప్రయాణించలేదు. హైదరాబాద్ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో, పని చేసే హెడ్ కానిస్టేబుల్‌కు పాజిటివ్ రావడంతో మొత్తం తెలంగాణ పోలీసు విభాగం అప్రమత్తమైంది.
గతంలో భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో డీఎస్పీగా పని చేసే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన కుమారుడు లండన్ నుంచి తిరిగి రాగా.. కొడుకు నుంచి సదరు అధికారికి ఇన్ఫెక్షన్ సోకింది. తెలంగాణ పోలీసు విభాగంలో ఇప్పట్టి వరకు రెండు పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.