రేపే తెలంగాణపై ప్రకటన..!!
posted on Jul 29, 2013 @ 12:03PM
తెలంగాణ పై తేల్చే దిశగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యుపిఎ వడి వడిగా అడుగులు వేస్తుంది.. గతం వారం రోజులగా తెలంగాణపై విస్త్రుత స్ధాయిలో జర్చలు జరిపిన కాంగ్రెస్ అదిష్టానం ఇప్పటికే తెలంగాణపై అభిప్రాయ సేకరణ పూర్తియందని ప్రకటించింది.. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం చెప్పడమేనని చెప్పినని నేతలు ఆ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేశారు.
ఈ విషయంపై కాంగ్రెస్ యూపిఎలో తన భాగస్వామ్యపక్షాలయిన ఇతర పార్టీలతొ చర్చించనుంది. యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 29న ఏర్పాటవుతుందని తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 31వ తేదీన ఏర్పాటవుతున్నట్లు సమాచారం వచ్చింది. కానీ, ఈ నెల 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు సిడబ్ల్యుసి సమావేశం జరుగుతుంది.
సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు, మూడు రోజుల తర్వాత సిడబ్ల్యుసి సమావేశం నిర్వహిస్తారని భావించారు. కానీ, అదే రోజు సిడబ్ల్యుసి సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణపై తేల్చేయాలని కాంగ్రెసు భావిస్తోంది. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం సిడబ్ల్యుసి రాష్ట్ర విభజనకు ఆమోద ముద్ర వేస్తే అధికారిక ఆమోదం లభించినట్లవుతుంది.
ఆగస్టు 5నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్ననేపధ్యంలో, వీలైతే ఈలోగానే తెలంగాణపై తుది నిర్ణయం ప్రకటించాలని ప్రయత్నింస్తుంది కేంద్రం. యూపిఎ లోని ప్రదాన భాగస్వామ్యపక్షాలనైన శరద్‌పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ, ఫారూఖ్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్, అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్‌ఎల్డీ, ముస్లీంలీగ్ పార్టీలు ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుకు తమ మద్దతు ప్రకటించగా.. మిగిలిన పార్టీ మద్దతు అవసరం పడకపోవచ్చు అనే ధైర్యంతో ఉంది యుపిఎ.