తెలంగాణపై కాంగ్రెస్ కొత్త పల్లవి
posted on Jun 26, 2013 @ 11:30AM
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణ విషయం పై కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతుంది.. అందుకే కాంగ్రెస్ నాయకులతో పాటు అధిష్టానం కూడా రోజుకో మాట చెపుతూ తెలంగాణ ప్రజల మనోభావలతో ఆడుకుంటుంది..
ఇన్నాళ్లు తెలంగాణ అంశాన్ని తేల్చాడానికే అధిష్టానం సంప్రదింపులు జరుపుతుందని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మరో సారి కొత్త పల్లవి అందుకుంది..గతంలో తెరమీదకు వచ్చిన రాయల్ తెలంగాణ అంశాన్ని మరోసారి పరిశీలిస్తున్నట్టుగా చెపుతుంది..
ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ జిల్లాలతో పాటు రాయలసీమలో అనంతపూర్, కర్నూల్ జిల్లాలను కూడా కలిపి రాయల్ తెలంగాణగా ఏర్పాటు చేసే ఆలోచన కూడా పరిశీలిస్తున్నారట..
తెలంగాణాలోని 119 నియోజిక వర్గాలతో పాటు కర్నూలు 14, అనంత పూర్ 14 నియోజిక వర్గాలు కలిపి మొత్తం 147 స్థానాలు అవుతాయి అంటే సరిగ్గా ఆంద్రప్రదేశ్‌లోని సగం స్ధానాలు.. ఇలా సరిగ్గా రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించే ఆలొచనలో ఉందట అధిష్టానం..
ప్రస్థుతం స్థానిక సమరం ఉన్నందున అవి పూర్తవగానే వీలైనంత త్వరగా అసెంబ్లీలో ఈ తీర్మాణం పెట్టాలని భావిస్తుందట.. మరి మాట మీదైన కాంగ్రెస్ నిలబడుతుందో లేదో చూడాలి..