పేర్లతో కన్ఫ్యూజన్ ...పవన్ ఓటమికి జగన్ కుట్ర
posted on Apr 12, 2024 @ 11:45AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కొత్త కుట్రకు తెరలేపాడు. తన సత్తా చాటాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు త్రాగించటానికి వైసిపి ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కు వరుస షాకులు తగులుతున్నాయి.పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు కొత్త తలనొప్పి ఇక ఇదే సమయంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ ఢిల్లీ వెళ్లి మరీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులు తాము ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించుకోవాలని బెదిరిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా పిఠాపురంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. పిఠాపురంలో పోటీలో మరో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తారని జనసేన వర్గాలు భావిస్తుంటే, తాజాగా ఆయనకు అతిపెద్ద సమస్య వచ్చి పడింది. పిఠాపురం నియోజకవర్గం నుండి కనుమూరి పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థి బరిలోకి దిగుతున్నట్టు సమాచారం. ఈయన నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల ప్రచార పర్వంలో జనసేన దూసుకుపోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో దుమ్మురేపుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ శ్రేణులతో కలిసి జనసేన శ్రేణులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ... ఒక విషయం ఆ పార్టీని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అదే బకెట్ గుర్తు. కామన్ సింబల్స్ లో ఎన్నికల సంఘం బకెట్ గుర్తును కూడా కేటాయించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన నేతల పేర్లతో ఉన్న వారు బకెట్ సింబల్ తో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బకెట్ గుర్తు అచ్చం జనసేన గుర్తు గాజు గ్లాసును పోలి ఉంది. నవరంగ్ కాంగ్రెస్ అనే ఓ పార్టీ బకెట్ సింబల్ తో తన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. పిఠాపురంలో కె. పవన్ కల్యాణ్, తెనాలిలో ఎన్. మనోహర్, మచిలీపట్నం ఎంబీ అభ్యర్థిగా బాలశౌరి అనే అభ్యర్థులను బరిలోకి దించింది. జనసేనకు ఓటు వేసే ఓటర్లు ఈ గుర్తుల విషయంలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కారు గుర్తును పోలిన సింబల్స్ ఆ పార్టీని ఇబ్బందికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. జనసేనాని పోటీ చేస్తున్న పిఠాపురంలో రెండు సమస్యలు వచ్చి పడ్డాయి. పవన్‌పై మరో పవన్ పోటీకి సిద్ధమయ్యారు.. ఇద్దరి ఇంటి పేర్లు కే కావడం.. ఇద్దరి పేర్లు పవన్ కళ్యాణ్ కావడం విశేషం. అంతేకాదు గుర్తు విషయంలోనూ చిక్కులు వచ్చి పడ్డాయి. జనసేనానిపై పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పార్టీ గుర్తు కూడా చూసేందుకు అటు ఇటుగా జనసేన గ్లాసు గుర్తుకు దగ్గరగా ఉంది.. ఈ పరిణామాలు ఇబ్బందిగా మారాయి.