గణేశ్ నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్
posted on Sep 6, 2025 @ 4:53PM
హైదరాబాద్‌లో జరుగుతున్న గణేశ్ నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుడిలా ఎన్టీఆర్ మార్గ్ కు చేరుకున్నారు. కాన్వాయ్ లేకుండా పరిమిత వాహనాలతో ట్యాంక్ బండ్ కు వెళ్లిన సీఎం.. క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనాలను పరిశీలించారు. అక్కడే ఉన్న జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి నిమజ్జనాల ఏర్పాట్లను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు.
ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం జరగాల్సి ఉంది? బందోబస్త్ వివరాలపై ఆరా తీశారు. సీఎం రేవంత్ రాకతో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. సీఎంతో కరచాలనం చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు. బాగా రద్దీగా ఉండే సమయంలో ముఖ్యమంత్రి ఆకస్మికంగా పర్యటించడం అధికారులు గుబులేపింది. శనివారం ఉదయం నుంచి విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. ఖైరతాబాద్ వినాయక విగ్రహం నిమజ్జనం మధ్యాహ్నం పూర్తయింది.