బెంగాల్లో ఆగని హింస.. మమత ఎక్కడ?
posted on May 10, 2021 @ 3:31PM
పశ్చిమ బెంగాల్ అస్సెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఇంచుమించుగా వారం రోజుల పైనే అయింది. ముఖ్యమంత్రిగా మంట బెనర్జీ మూడవసారి ప్రమాణ స్వీకారంచేసి కూడా ఐదారు రోజులైంది. అయినా, ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మొదలైన హింస ఇంకా ఆగలేదు. తాజాగా వీర్భూమ్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. దుబ్రాజ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ముక్తినగర్ గ్రామంలో తృణమూల్ బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారని, మరో ఆరుగురు గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు.
ఈ నెల ఐదవ తేదీన ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీఅక్రం చేసిన సందర్భంగా మమత బెనర్జీ, ఇంతవరకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎన్నికల సంఘం అధీనంలో వుంది, ఈ రోజు నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలకు నాదీ పూచీ, ఇకపై రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగా కుండా చర్యలు తీసుకుంటాను. కరోనా కట్టడి తర్వాత, రెండవ ప్రాధాన్యత శాంతి భద్రతల పరిరక్షణే అని ఘట్టిగా చెప్పారు.అంతే కాదు, రాజకీయ పార్టీలు హింసకు తావీయరాదని విజ్ఞప్తి చేశారు. అలాగే, హింసను కట్టడి చేసందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని, కఠిన చర్యలతో హింసను అణచి వేస్తామని చెప్పారు.
అయితే, మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్రంలో హింస ఆగలేదు, సరి కదా, మరింతగా ప్రబలుతోంది. ఇటు అధికార పార్టీ కార్యకర్తలు, అటు బీజేపీ కార్యకర్తలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే, పశ్చిమ మిడ్నాపూర్’ ప్రాంతంలోని పంచక్కుడిలో కేంద్ర మంత్రి మురళీ ధరన్ కాన్వాయ్’పై తృణమూల్ కార్యకర్తలు కర్రలు, కత్తులతో దాడి చేశారు.కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల వర్షం కురిపించారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అలాగే, మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారానికి ముందు ఎలాంటి పరిస్థితి వుందో, ఈరోజుకు కూడా రాష్ట్రంలో అదే పరిస్థితి ఉందని,తాజా సంఘటన సహా ప్రతినిత్యం జరుగతున్న సంఘటనలే రుజువు చేస్తున్నాయి. మరో వంక పోలీసులు ప్రేక్షక పాత్ర పోషితున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఇదిలావుండగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బృందం శని, ఆదివారాలలో రాష్ట్రంలో హింస చోటుచేసుకున్న ప్రాంతాలను సందర్శించింది. ఆదివారం బృందం వీర్భూమ్ జిల్లాలో పర్యటిస్తోంది. మే 2 న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత నుంచి పశ్చిమ బెంగాల్‌లో హింసాయుత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితాలు వెలువడిన రెండు మూడు రోజుల్లోనే 16 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని, ఆ పార్టీ జాతీయ అధ్యక్షడు నడ్డా ప్రకటించారు.మరోవనక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల విషయంలో ప్రత్యేకదృష్టిని కేంద్రీకరించింది.
అదలాఉంటే, కేంద్ర మంత్రి కాన్వాయ్’ దాడి సంఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేసమాని పోలీసులు చెపుతున్నారు. ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే, అసలు దోషులను వదిలేసి, బాధితులపై కేసులు పెడుతున్నారని, బీజేపీ నాయకులూ ఆరోపిస్తున్నారు. అలాగే, ఇతర సంఘటనలకు సంబంధించి మమత బెనర్జీ ప్రభుత్వం ప్రేక్షక పాత్రను పోషిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవంక కేంద్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించడంతో పాటుగా, ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి పంపిన కేంద్ర బలగాలను అవసరార్ధం అక్కడే ఉంచింది. అవసరం అయితే రంగంలోకి దించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని కేంద్ర హోమ్ శాఖ వర్గాల సమాచారం. మొత్తానికి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, స్థానిక సమాచారం. మరో వంక కరోనా కట్టడికి రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా ఓ వంక కరోనా, మరో వంక హింస బెంగాల్’ ను కలవరానికి గురిచేస్తోంది.