ఆర్టీసీ యూనియన్లకు ఆఖరి వార్నింగ్ ఇస్తున్న టీఎస్ ప్రభుత్వం

సాయంత్రం ఆరు గంటలకు ఏమి జరగబోతోంది అని అందరిలో టెన్షన్ నెలకొంది.యూనియన్ల ఉచ్చులో పడి ఉద్యోగా లు పోగొట్టుకోవద్దని ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. చట్టబద్ధం కాని సమ్మెకు కార్మిక యూనియన్లు వెళుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం ఆరు గంటల్లోగా విధుల్లో చేరకపోతే సదరు కార్మికులు తమకు తాముగా విధుల్లోంచి తొలగినట్టుగా భావిస్తామని స్పష్టం చేశారు. అసంబద్ధమైన ప్రవర్తన తో కార్మికు లకు నాయకులూ అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. మన ఆర్టీసీ కార్మికు లకు దేశంలోనే అత్యధిక వేతనాలు ఉన్నాయన్నారు. నాలుగు వేల ఉద్యోగు లను క్రమబద్దీకరించామన్నారు ఆర్టీసీ విలీనంపై టీఆర్ఎస్ ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. లాభాలొచ్చే పండుగ రోజుల్లో సమ్మె కు దిగడం ఏమిటని ప్రశ్నించారు. యూనియన్ లతో ఇక పై చర్చలు జరిపేది లేదన్నారు. మూడు రోజులుగా ఆర్టీసీ కార్మి కుల డిమాండ్ల పై ఐఏఎస్ తో త్రిసభ్య కమిటీ చర్చించి ఆ సారాంశాన్ని సీఎంకు వివరించిందన్నారు సమ్మెపై నిషేధం కొనసాగుతున్న సమయంలో. సమ్మె కు వెళ్లడం ఎంత వరకు సమంజసమని ప్రశ్ నించారు.

భవిష్యత్ లో ఎలాంటి సంఘటనలు జరిగినా కార్మిక సంఘాల నాయకులే బాధ్యత వహించాలని హెచ్చరించారు అంతకుముందు ఆర్టీసీ సమ్మె అనివార్యమైతే తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ జిల్లాల కలెక్టర్ లను మంత్రి పువ్వాడ అంజి ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కలెక్టర్ లతో మంత్రి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు ప్రైవేటు బస్సు లను స్కూల్ కళాశాల బస్సు లను నడిపిం చేలా ఏర్పాట్లు చేసుకోవా లని సూచించారు. ప్రైవేటు బస్సులను ఆర్టీసీ కార్మికులు అడ్డు కుంటే వారి పై కేసు లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మె నేపథ్యం లో నగరంలో ప్రయాణి కుల సౌకర్యార్ధం ప్రతి మూడు నిమిషా లకు ఒక రైలు నడిచేలా చర్యలు తీసుకోనున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు ఉదయం ఐదు గంటలకు బయలుదేరతాయని చివరి రైలు రాత్రి పదకొండున్నర గంటలకు బయలుదేరి పన్నెండున్నర గంటలకు ఇతర టెర్మినల్ స్టేషన్ లకు చేరేలా ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. రద్దీని తట్టుకోవడానికి వీలుగా అదనపు టిక్కెట్ కౌంటర్ లు యంత్రాలూ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.ఇప్పటికే ఆర్టీసీ వేల మంది డ్రైవర్లను నియమించుకోగా రెండు వేల మంది కండక్టర్లను కూడా ప్రభుత్వం నియమించారు. రేపటి నుండి  యధావిధిగా బస్సులను రోడ్లపైకి తీసుకురావడానికి వీలైనంత ప్రయత్నం చేస్తున్నట్లు టీఎస్ ప్రభుత్వం వెల్లడించారు.ప్రయాణికులను ధైర్యంగా ఉండాలని వారు తమ సొంత  ప్రాంతాలకు సురక్షితంగా వెళ్ళేందుకు అధనపు పోలీసులను నియమించినట్లు తెలియజేశారు.

Teluguone gnews banner