కరోనా తగ్గడంలేదు! ఉధృతంగా ఉంది! ఇళ్లకే పరిమితం అవ్వండి! సి.ఎం.
posted on Apr 19, 2020 @ 9:42PM
రోజు రోజుకు కేసులు పెరుగుతూనే వున్నాయి. కాబట్టి మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలుచేస్తున్నాం. ఇప్పట్టికే 50 వేల వాహనాల్ని పోలీసులు సీజ్ చేశారు. కాబట్టి దయచేసి ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దు. వ్యాధి తగ్గలేదు. వైరస్ నియంత్రణలో లేదు. మరింత ఉధృతంగా వుంది కాబట్టి జాగ్రత్తగా వుండమని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఏమైనా అవసరమైతే డయల్ 100కు ఫోన్ చేయండి. మీకష్టాల్ని తొలగించడానికి అధికారులు సిద్ధంగా వున్నారు. ప్రజలు ప్రభుత్వం కలిసి కరోనాను ఎదుర్కొంటే ఈ ప్రమాదం నుంచి బయట పడతాం. ఇప్పట్టి వరకూ ఈ వ్యాధికి మందు లేదు. ఆ విషయం గుర్తు పెట్టుకోమని ప్రజలకు ముఖ్యమంత్రి పదే పదే విజ్ఞప్తి చేశారు. ఈ రోగానికి మందు లేదు. వేరే మార్గం లేదు. ఉపశమనచర్యలే. వ్యక్తి గత నియంత్రణ పాటించడం. లాక్ డౌన్ ఇంతకు మించిన ఆయుధం ప్రస్తుతం మరొకటి లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించి కొన్ని దేశాలు భారీ మూల్యం చెల్లించుకుంటున్న విషయాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
14 అంతస్థుల స్పోర్స్ట్ కాంప్లెక్స్‌ను హెల్త్ డిపార్టెమెంట్‌కు బదిలీ చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. నిమ్స్ కంటే ఎక్కువ సదుపాయాలతో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తెలంగాణా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసర్చ్ టిమ్స్‌ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం దీన్ని కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా ఉపయోగిస్తాం. 1500 బెడ్‌లను సిద్ధం చేశాం. రేపటి నుంచి గచ్చిబౌలి కరోనా ఆసుపత్రి ఉపయోగంలోకి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో రోజుకు 1500 మందికి టెస్ట్‌లు చేసే సదుపాయం వుంది.
జూన్ 7వ వరకు ఫంక్షన్లకు అనుమతి ఇవ్వం. కాబట్టి ఫంక్షన్ హాళ్లను తాత్కాలిక గౌడన్లుగా వాడుకొని రైతులకు ఆదుకోమని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగింపు తన వ్యక్తి గత నిర్ణయం కాదు. ప్రభుత్వం సర్వే ద్వారా ప్రజల నుంచి సేకరించిన సమాచారంతో క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.