మాస్క్ తో మూతి తుడుచుకున్న జగన్.. నెవ్వర్ బిఫోర్ మెసేజ్ అంటూ ట్రోలింగ్
posted on Aug 15, 2021 @ 7:10PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టైలే డిఫరెంట్. ఆయన తీరు అందరికి భిన్నంగా ఉంటుంది. అందరిది ఒకదారి ఉలిపికట్టెది మరో దారి అన్నట్లుగా దేశమంతా ఒక దారిలో పోతుంటే.. ఏపీలో జగన్ రెడ్డి పాలన మరో దారిలో పోతుందనే విమర్శలు ఉన్నాయి. అధికారంలోకి రాగానే ఆయన రివర్స్ టెండరింగ్ అంటూ కొత్త పాలసీ తీసుకురావడం కూడా ఇందులో భాగమే అంటారు. రివర్స్ టెండరింగ్ పాలసీ లాగానే జగన్ రెడ్డి పాలనంతా రివర్స్ గానే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కరోనా కట్టడి విషయంలోనూ సీఎం జగన్ తీరు అందరికింటే భిన్నంగానే ఉంది. ఏపీ సీఎం జగన్ కు, కరోనాకు ఉన్న అవినాభావ సంబంధం గురించి గతంలో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది.కరోనా మామూలు జలుబులాంటిదని, పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనాను తరిమేయొచ్చంటూ జగన్ చేసిన ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరోనాతో సహజీవనం తప్పదంటూ జగన్ అన్న మరో మాట ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అయింది. కరోనా కట్టడికి మాస్క్ ధరించడమే ప్రధానమని వైద్య నిపుణులు చెబుతుంటే .. ఏపీ సీఎం జగన్ మాత్రం మాస్క్ జోలికే వెళ్లలేదు. మాస్క్ లేకుండా సమావేశాలకు హాజరయ్యారు. బహిరంగ వేదికపైనా జగన్ మాస్కు పెట్టుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జనాలు మాస్కు పెట్టకోకపోతే ఫైన్ గా ఫైన్ వేస్తానని చెప్పే జగనన్న మాస్కు పెట్టుకోరంటూ విమర్శలు వచ్చాయి.
కరోనా సమయంలో ఎక్కువగా బయటికి రాలేదు జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచే అంతా నడిపించారు. మాస్కులు, శానిటైజర్లు… నాకెందుకు వచ్చిన గోల అనుకున్న జగన్…తాడేపల్లి ప్యాలెస్ వదిలి అడుగు బయటపెట్టడం లేదని సోషల్ మీడియాలో విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. దీంతో ఈ మధ్య కాలంలో జగన్ మాస్కు పెట్టుకొని జనాలకు అప్పుడప్పుడు దర్శనమిస్తున్నారు ఏపీ సీఎం. సీఎం హోదాలో స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ఎగురవేయక తప్పదు కాబట్టి…తాజాగా తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించే దాకా అంతా బాగానే ఉంది. ఏపీ ప్రజలను ఉనుద్దేశించి మాట్లాడాల్సిందిగా జగన్ ను ఆహ్వానించగానే…ఏపీ ప్రజలకే కాదు యావత్ ప్రపంచ దేశాల ప్రజలకు ఓ గొప్ప సందేశాన్నిచ్చారు జగన్.
ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి వచ్చిన జగన్…అప్పటిదాకా అతి కష్టం మీద పెట్టుకున్న మాస్కును…అతి సులువుగా తీసి పడేశారు. అయితే అప్పటిదాకా కరోనా నుంచి తనకు రక్షణనిచ్చిన మాస్క్ అని చూడకుండా…మాస్క్ పై ఏమాత్రం కనికరం లేని జగన్… అదే మాస్క్ ను కర్చీఫ్ లా భావించి మూతి తుడుచుకున్నారు. దీంతో, మాస్కును ఇలా కూడా వాడవచ్చా అంటూ అక్కడున్న వారితో పాటు…ఆ వేడుకలను లైవ్ చూస్తున్న వారంతా మాస్కు మీద వేలేసుకున్నారు. నోటితో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే జగన్ ఇచ్చిన ఈ సందేశం నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది.
స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏ సీఎం, ఏ పీఎం, ఏ దేశాధ్యక్షుడు ఇవ్వలేని గొప్ప సందేశాన్ని ఇచ్చిన ఘనత జగన్ దే నంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. మాస్క్ ను ఇలా కూడా వాడతారా…నువ్వు దేవుడివి స్వామి అంటూ మీమ్స్, సెటైర్లు పేలుస్తున్నారు. ఇన్నాళ్లు ఈ టెక్నిక్ తెలీక ఎన్ని కర్చీఫ్ లు కొన్నానో…అంటూ మన్మథుడు సినిమాలో బ్రహ్మి డైలాగ్ తో మీమ్స్ పేలుస్తున్నారు. రాక రాక…ఆర్నెల్ల తర్వాత జనం మధ్యలోకి వచ్చిన వచ్చిన జగన్…మరో 6 నెలలకు ట్రోలింగ్ కు సరిపడా కంటెంట్ ఇచ్చిపోయారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మాస్క్ వాడకంలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన జగన్…అంటూ ట్రోలింగ్ జరుగుతోంది.