చంద్రబాబు నిర్ణయం.. వైసీపీ షాక్.. తెలుగు తమ్ముళ్లు హ్యాపీ..
posted on Jan 4, 2016 @ 11:49AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్ష పార్టీ నేతల సంగతి ఏమో కానీ టీడీపీ నేతలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారంట. అంతలా పార్టీ నేతలు సంతోషపడే పని చంద్రబాబు ఏం చేశారనుకుంటున్నారా.. నిధులు పేరిట వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గంలో కూడా టీడీపీ ఇన్ ఛార్జ్ లకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అంతేకాదు ఇందులో ఏదైనా ఇబ్బంది తలెత్తితే… వారికి నియోజకవర్గం పరిధిలో ఏదైనా బాధ్యతలు అప్పగించి చట్టపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే నిర్ణయానికి కూడా చంద్రబాబు వచ్చారంట. దీంతో ఒకవైపు వైసీపీ నేతలు ముఖ్యమంత్రి నిర్ణయానికి ఖంగుతింటే.. మరోవైపు తెలుగు తమ్ముళ్లు మాత్రం చంద్రబాబు సూపర్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీని నమ్ముకున్న తమ నాయకులను ఎందుకు దూరం చేసుకోవాలనే ఆలోచనతోనే చంద్రబాబు ఇలాంటి సరికొత్త నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మొత్తానికి చంద్రబాబు మాత్రం తమ పార్టీ నేతలను దూరం చేసుకోకూడదని భావిస్తున్నట్టు అర్ధమవుతోంది.