ప్రజా సమస్యలను తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం.. చంద్రబాబు
posted on Jan 2, 2016 @ 3:26PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లా బొండపల్లిలో మూడో విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసమే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని చేపట్టామని.. ప్రజా సమస్యలను తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అంతేకాదు అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాదు.. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలున్నా ఈ కార్యక్రమంలో అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు.
మరోవైపు ఉపముఖ్యమంత్రి చిన రాజప్ప కూడా పెద్దాపురం నియోజకవర్గంలోని చదలవాడ గ్రామంలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులను అందిస్తామని.. పేద ప్రజల సంక్షేమం కోసమే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.