విజయరామారావుకి చంద్రబాబు ఫోన్..సందిగ్ధంలో విజయరామారావు..
posted on Dec 12, 2015 @ 2:21PM
టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే చాలామంది ఆపార్టీలోకి చేరారు. ఇప్పుడు తెలంగాణ టీడీపీ నేత విజయరామారావు కూడా టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు పడిపోయాడని.. టీఆర్ఎస్ లో చేరుతున్నారని.. కేసీఆర్ తనయుడు కేటీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి గులాబి కుండువా కప్పబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే నిన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే విజయరామారావు పార్టీకి రాజీనామాచేయడంతో.. పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. చంద్రబాబే స్వయంగా విజయరామారావుకి ఫోన్ చేసి పార్టీ మారే విషయంలో ఆలోచించుకోమని.. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని సూచించారట. ఇక చంద్రబాబే స్వయంగా ఫోన్ చేసి చెప్పేసరికి విజయరామారావు కూడా సందిగ్దంలో పడిపోయారంట.