రామోజీరావును ఎక్కడ కూర్చోబెడతారో?
posted on Oct 20, 2015 @ 11:09AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అందరికి ఆహ్వానాలు పంపుతున్న నేపథ్యంలో రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు ఆహ్వానం అందిస్తారా? లేదా? అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఆ డౌట్లను బ్రేక్ చేస్తూ చంద్రబాబు నిన్న రామోజీ ఫిలిం సిటీ కి వెళ్లి రామోజీరావును స్వయంగా ఆహ్వానించారు. ఆ డౌట్ అయిపోయింది.. ఇప్పుడు ఇంకో డౌట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చంద్రబాబు రామోజీరావును ఎక్కడ కూర్చోపెడతారా అని.
ఎందుకంటే రామోజీ రావుకు జాతీయస్థాయిలో ఎంత గుర్తింపు ఉందో మనందరికి తెలిసిన విషయమే. గత ఎన్నికల్లో గెలుపొంది మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసే నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖులను ఆహ్వానించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు ఆఖరికి ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కూడా రెండో వరుసలో కూర్చోగా రామోజీరావుకు మాత్రం మొదటివరుసలో స్థానం దక్కింది. ఈ ఒక్క విషయం చాలు రామోజీ రేంజే ఏంటో ఉదహరణ చెప్పడానికి.
మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు రామోజీరావుకు ఏస్థానం కల్పిస్తారా అనేదే అందరి సందేహం. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మొత్తం మూడు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మూడింటిలో ప్రధాన వేదికపై చంద్రబాబు, ప్రధాని మోడీతో పాటు మరో పదిహేను వీవీఐపీలు ఆసీనులుకానున్నారు. మిగిలిన రెండు వేదికల్లో పార్టీ ప్రముఖులు ఆసీనులు కానున్నారు. మరి ఈ మూడు వేడుకల్లో ఖచ్చితంగా రామోజీరావుకు ప్రధాన వేదికపై స్థానం ఉంటుంది అని చెప్పుకునే వారు కూడా ఉన్నారు. మరి ఈ మూడు వేదికల్లో ఏ వేదికపై స్థానం కలుగుతుందో శంకుస్థాపన వరకూ ఆగాల్సిందే.