పిలవలేదనే ఫ్రస్ట్రేషన్ లో బొత్స.. అందుకే చంద్రబాబు పై విమర్శలా?
posted on Oct 19, 2015 @ 5:02PM
కాంగ్రెస్ పార్టీ నుండి వైకాపాలోకి చేరి చాలా తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న నేత బొత్స సత్యనారాయణ. తన రాజకీయానుభవంతో జగన్ సైతం తన మాట వినేలా.. తన కుడి భుజంలా తయారయారు. అయితే అదే పార్టీలో ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడని.. తమనే శాసిస్తున్నాడని మూతి విరుపులు విరిచే వారు ఉన్నారు. అయితే ఇప్పుడు పార్టీలో నేతలను ప్రశ్నించిన మాదిరి ఇప్పుడు సీఎం చంద్రబాబును కూడా ప్రశ్నిస్తున్నారు బొత్సా.
ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం అందిచడానికి చంద్రబాబు కేసీఆర్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బొత్స.. చంద్రబాబు కేసీఆర్ కలిసి ఏం మాట్లాడుకున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. జగన్ తాను శంకుస్థాపనకు రానని.. ఆహ్వనం పంపించవద్దని.. తగు అంశాలతో కూడిన లేఖ రాసిన నేపథ్యంలో.. జగన్ రాసిన లేఖకు సమాధానం చెప్పలేదని.. ఏ ఒక్క అంశానికి సమాధానం ఇవ్వలేదని తప్పుబట్టారు. అంతేకాదు ఏపీ రాజధానికి తాము ఏమాత్రం వ్యతిరేకం కాదు.. కానీ ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమంతో ఏపీని సింగపూర్ కు కట్టబెట్టడంపై వ్యతిరేకిస్తున్నామని మండిపడుతున్నారు.
అయితే బొత్స అనవసరంగా ఎందుకు ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా అంటే అసలు విషయం వేరే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదేంటంటే ఏపీ శంకుస్టాపన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకపోవడమే కారణమంట. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తనకంటే తక్కవు పదవిలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, రఘువీరా రెడ్డిని కూడా చంద్రబాబు ఆహ్వానించారట. కానీ ఇప్పుడు కీలకమైన పదవిలో లేకపోవడంతో బొత్సను చంద్రబాబు ఆహ్వానించలేదట. అయితే తన పాత పదవి చూసైనా చంద్రబాబు తనని ఆహ్వానిస్తారని చూసినా చంద్రబాబు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ ఫ్రస్ట్రేషన్ లో బొత్స చంద్రబాబును విమర్సిస్తున్నారని అనుకుంటున్నారు.