ఇక నుండి చంద్రబాబు అక్కడే..

 

సీఎం చంద్రబాబు ఏపీ రాజధానిలో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసి అక్కడి నుండే పాలన చేద్దామని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే విజయవాడను తాత్కాలికి కేంద్రంగా ఏర్పాటు చేయడానికి పనులు ముమ్మరం చేస్తున్నారు. వారంలో 5 రోజులు అక్కడే ఉండి పాలనా కార్యక్రమాలు సీఎం చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకోవడంతో మిగిలిన అధికార యంత్రాంగం కూడా దీనికి సముఖత చూపి ఆ దిశగా అడుగులు వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం ఈ నిర్ణయం తీసుకోవడంతో సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా చంద్రబాబు బాటలో తాను కూడా విజయవాడలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతో సీఎం చంద్రబాబు పాలనా కార్యక్రమాలు ఇక్కడి నుండే చేసే నేపథ్యంలో హైదరాబాద్ లోని కార్యలయాలు.. ఉద్యోగులను ఇక్కడకు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

అయితే ఉద్యోగులు పనులు చేయడానికి కార్యాలయాలు, ఉండటానికి ఏం వసతులు కావాలి తదితర వివరాలు సేకరించే పనిలో పడ్డారు. దీనిలో భాగంగానే విజయవాడలో ఉన్న అద్దే ఇళ్ల లెక్కలు తీసే పనిలో పడ్డారు అధికారులు. అయితే హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఉద్యోగుల సంఖ్య సుమారు పాతిక వేలు ఉంటుందని అంచనా. అయితే ప్రస్తుతానికి విజయాడలో ఉన్న ప్రభుత్వ కార్యలయాల్లో ఇప్పటికే కొంతమంది అధికారులు ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ నుండి వెళ్లే ఉద్యోగులకు కావలసిన స్థలం లేకపోవడంతో విజయవాడలోని అద్దె ఇళ్లపై ప్రభుత్వం దృష్టిసారించింది. అంతేకాదు హైదరాబాద్‌ నుంచి వెళ్లేవారికే కాకుండా అవసరమైతే ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకి తాత్కాలిక ప్రాతిపదికన అద్దె ఇళ్లు సమకూర్చాలన్నది ప్రభుత్వ ఆలోచన.

Teluguone gnews banner