చంద్రమోహన్ హెల్త్ ఓకే...
posted on Feb 19, 2015 @ 3:39PM
ప్రముఖ నటుడు చంద్రమోహన్ గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి ఐసీయులో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన కోలుకుంటున్నారని తెలిసింది. ఈ విషయాన్ని చంద్రమోహన్ మేనల్లుడు, ప్రముఖ నిర్మాత కృష్ణ ప్రసాద్ తెలియజేశారు. తన మేనమామ చంద్రమోహన్ స్వల్ప గుండెపోటుకు గురయ్యారని, ఆయనకు ప్రాణాపాయం లేదని, రెండు మూడు రోజుల్లో ఆయన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని అపోలో వైద్యులు చెప్పారని కృష్ణ ప్రసాద్ తెలిపారు.