సీఎం చంద్రబాబు... ప్రొక్లెయినర్ డ్రైవర్
posted on Feb 19, 2015 @ 3:48PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రొక్లెయినర్ నడిపారు. గురువారం నాడు ఆయన ప్రొక్లెయినర్ నడుపుతూ చెట్టు - నీరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాకు చేరుకున్న ఆయన హెలికాప్టర్లోనుంచి హంద్రీ నీవా కాలువ పనులను పరిశీలించారు. ఆ తర్వాత బి. కొత్తకోట మండలం గుమ్మసముద్రం గ్రామంలో నీరు - చెట్టు పైలాన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రొక్లెయినర్ నడుపుతూ ‘నీరు - చెట్టు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతోపాటు రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అయ్యన్నపాత్రుడు, బొజ్జల తదితరులు పాల్గొన్నారు.