ముగ్గురు అమ్మాయిలతో గేల్ పార్టీ
posted on Oct 4, 2012 @ 11:49AM
వెస్టిండీస్ స్టార్ క్రిస్‌గేల్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గేల్‌తోపాటు సహచరులు ఆండ్రీ రస్సెల్, డ్వేన్ స్మిత్‌ల హోటల్ గదుల్లో ఉన్న ముగ్గురు అమ్మాయిల్ని పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. బ్రిటన్‌కు చెందిన ఈ గాళ్స్‌తో క్రికెటర్లు పార్టీలో మునిగితేలుతుండగా మంగళవారం తెల్లవారుజామున పోలీసుల కంటపడ్డారు. అరెస్టు చేసిన అమ్మాయిల్ని ఆ తర్వాత విడిచిపెట్టారు. ఆటగాళ్లు, టీమ్ అఫీషియల్స్‌కు మాత్రమే కేటాయించిన ఏడో ఫ్లోర్‌లోని గదులకు ఇతరుల్ని అనుమతించరు. కాగా న్యూజిలాండ్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరిన ఆనందంలో ఉన్న విండీస్ ఆటగాళ్లు తమ అతిథుల్ని గదులకు పిలిపించుకోవడం తప్పెలా అవుతుందని హోటల్ యాజమాన్యం ప్రశ్నిస్తోంది. కాగా, ఐసీసీ సూచనల కోసం తాము ఎదురుచూస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.