పవన్ విజయం, చిరంజీవి సంతోషం!
posted on Jun 4, 2024 @ 5:38PM
పవన్ కళ్యాణ్ సాధించిన విజయం ఆయన సోదరుడు చిరంజీవిని ఆనందంలో ముంచెత్తింది. సోషల్ మీడియా ద్వారా చిరంజీవి తన స్పందనను తెలిపారు. ‘‘డియర్ కళ్యాణ్ బాబు.. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నన్ను తగ్గావని ఎవరు అనుకున్నా.. అది ప్రజలను నెగ్గించడానికే అని నిరూపించావ్. నిన్ను చూస్తుంటే ఓ అన్నగా గర్వంగా వుంది. నువ్వు ‘గేమ్ ఛేంజర్’ మాత్రమే కాదు.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అని కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, నీ కలల్ని, నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తుందని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభినందనలు. నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు.