2జి కేసులో చిదంబరానికి ఊరట
posted on Aug 24, 2012 @ 11:38AM
2జి స్కామ్ కేసులో చిదంబరానికి ఊరట దొరికింది. ఆర్థిక మంత్రిగా తన హోదాను చిదంబరం దుర్వినియోగం చేశారంటూ జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఫిర్యాదు ఆధారాలు లేవుకనుక చిదంబరాన్ని తప్పుపట్టలేమని సుప్రీం వ్యాఖ్యానించింది. దీనిపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తానని సుబ్రమణ్యస్వామి చెబుతున్నారు. మొదటి పిటిషన్ లో చిదంబరం హోదాని దుర్వినియోగం చేశారని ఆరోపించిన సుబ్రమణ్యస్వామి ఇప్పుడు తన వాదనను కాస్తంత మార్చబోతున్నారు. 2జి స్కామ్ వల్ల దేశానికి చాలా నష్టం కలిగిందని, ఆర్థికమంత్రిగా చిదంబరం దాన్ని నివారించడానికి చర్యలు తీసుకుని ఉండాల్సిందని చెప్పబోతున్నారు. ధర్మాన ప్రసాదరావు రాజీనామా వ్యవహారంపైకూడా ఢిల్లీలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.