రోడ్డుపై గోడ నిర్మాణం! ఏపీ-చెన్నై సరిహద్దు వద్ద ఉద్రిక్తత!
posted on Apr 27, 2020 @ 9:52AM
లాక్‌డౌన్ సందర్భంగాఏపీ, చెన్నై ఆయా రాష్ట్రాలు.. సరిహద్దులను మూసివేశాయి. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్న సూచనలతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.. అయితే, తమిళనాడు అధికారులు చేసిన పని ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది.
కరోనా కట్టడికి ఏపీ సరిహద్దుల దగ్గర గోడలను నిర్మించారు అధికారులు. చిత్తూరు జిల్లాలోని మూడు సరిహద్దు ప్రాంతాల్లో వేళూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గోడను నిర్మించారు. పలమనేరు సమీపంలోని గుడియత్తాం వెళ్లే రహదారి, తిరుత్తణి మార్గంలోని శెట్టింతంగాళ్ తో పాటు బొమ్మ సముద్రం నుంచి తమిళనాడు వెళ్లే మార్గాలకు అడ్డంగా గోడలను నిర్మించారు.
ఈ గోడల నిర్మాణంపై చిత్తూరు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. కలెక్టర్ ఆదేశాలతో రోడ్డకు అడ్డంగా 6 అడుగుల మేర రాత్రికి రాత్రే గోడలను కట్టివేశారు తమిళ తంబీలు. అయితే ఇలా గోడలు కట్టడం ఏంటి? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రోడ్డు బంద్ కావడంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉండే గ్రామాల ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. అదే విధంగా, అత్యవసర సేవలు, నిత్యవసర సరకుల రవాణా కూడా లేకుండా పోయింది.