చరణ్ 'ఎవడు' మూవీ ఆడియో రివ్యూ
posted on Jul 3, 2013 @ 3:42PM
మెగా పవర్ పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఎవడు' ఆడియో ను సోమవారం శిల్పా కళావేదికలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అటు మాస్ ప్రేక్షకులను, ఇటు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ ఆల్బంలో అన్ని పాటలు మెగా ఫ్యాన్స్ ని అలరిస్తాయి. రామ్ చరణ్ లోని డాన్సింగ్ స్కిల్స్ ని చూపించడానికి చక్కని అవకాశం ఉంది. ఈ ఆల్బంలోని పాటల పై విశ్లేషణ మీ కోసం:
పాట1 : ఫ్రీడమ్
గాయకుడు : దేవి శ్రీ ప్రసాద్, సుచిత్ సురేసన్
సాహిత్యం : కృష్ణ చైతన్య
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ గా దీనిని చెప్పవచ్చు. ఫాస్ట్ బీట్స్ తో దేవి శ్రీ ప్రసాద్ ఈ సాంగ్ ని డిఫరెంట్ గా డిజైన్ చేశాడు. కృష్ణ చైతన్య రాసిన సాహిత్యం బాగుంది. అందులోనూ యువతకు ప్రేరణ ఇచ్చేలా పాటను ప్రత్యేకంగా రాయించటంతో ఈ పాట డీసెంట్ హిట్ గా ఈ ఆల్బమ్ లో నిలుస్తోంది.
సాంగ్ 2: నీ జతగా
గాయనీ గాయకులు : కార్తీక్, శ్రేయా ఘోషల్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సీతారామశాస్త్రిగారు సాహిత్యం రాసిన ఈ పాట ఈ ఆడియో కి హైలైట్ గా చెప్పవచ్చు. కార్తీక్, శ్రేయ ఘోషల్ వాయిస్ ఈ పాటకు పెద్ద ప్లస్. ఈ ఆల్బమ్ లో బాగా పాపులర్ అవుతుంది. ఈ సాంగ్ ప్రోమో చూస్తే...పాటను కూడా బాగా తీశారని అర్థమవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ చేసిన టాప్ టెన్ మెలోడి సాంగ్స్ లో ఈ పాట ఒకటిగా చెప్పవచ్చు.
సాంగ్ 3: అయ్యో పాపం
గాయనీ గాయకులు : రంజిత్, మమత శర్మ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
దేవి శ్రీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఐటెం సాంగ్స్. ఐటెం సాంగ్స్ చేయడంలో దేవి శ్రీ దిట్ట అని చెప్పవచ్చు. ఈ పాటలో దేవీశ్రీ మంచి బీట్స్ తో వినే వారికి మంచి ఎనర్జీ ఫీల్ ని క్రియేట్ చేసాడు. గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక పాటలాగ ...టాప్ లేచిపోద్ది రేంజిలో ఈ పాట దుమ్మురేపేలా ఉంది. రామజోగయ్యశాస్త్రి మంచి సాహిత్యాన్ని అందించారు. మమత శర్మ వాయిస్ చాలా బాగుంది.
సాంగ్ 4: చెలియా
గాయకుడు : కె.కె
సాహిత్యం : చంద్రబోస్
చెలియా చెలియా’ పాట కి చంద్రబోస్ సాహిత్యం అందించాడు. ఇదో ప్రయోగాత్మకమైన పాట అని చెప్పుకోవాలి. పెయిన్ ని ఈ పాటలో చూపించాడు. ఈ పాటలోని సాహిత్యం వల్ల వినడానికి డీసెంట్ గా ఉంది. ఈ పాట సినిమాలో చాలా కీలకమైన సమయంలో వస్తుందని ఆశించవచ్చు. ఈ ఆల్బంలో యావరేజ్ సాంగ్ గా దీనిని చెప్పవచ్చు.
సాంగ్ 5: ఓయే ఓయే
గాయనీ గాయకులు : డేవిడ్ సిమోన్, ఆండ్రియా
సాహిత్యం : శ్రీ మని
ఓయే ఓయే రొమాంటిక్ డ్యూయెట్. సంగీత ప్రియులను మత్తుగా చిత్తు చేసాలా ఈ పాటను దేవి డిజైన్ చేసారు. డేవిడ్ సిమోన్, ఆండ్రియా వాయిస్ బాగుంది. అయితే అంతకుముందు విన్న పాటలతో పోలిస్తే పెద్దగా కిక్ ఇవ్వదు. కానీ స్క్రీన్ పై రామ్ చరణ్ అదరకొట్టేలా మాత్రం ఉంది.
సాంగ్ 6: పింపుల్ డింపుల్
గాయనీ గాయకులు : సాగర్, రనిన రెడ్డి
సాహిత్యం : రామ్ జోగయ్య శాస్త్రి
‘పింపుల్ డింపుల్’ ఈ ఆల్బంలోని మరో మాస్ సాంగ్. ఈ సాంగ్ మంచి బీట్స్ తో వేగంగా ఉంది. ముఖ్యంగా ముందు బెంచ్ వారిని టార్గెట్ చేసిన పాట ఇది. సాగర్ – రనిన రెడ్డిలు తమ వాయిస్ లతో పాటని బాగా పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఓకే అనేలా ఉంది. దేవీశ్రీ ఈ పాటకి మాస్ బీట్స్ తో ఊపు తెచ్చే మ్యూజిక్ ఇచ్చాడు.