యుపీఎస్సీకి లేఖ రాసిన చంద్రబాబు
posted on May 24, 2024 @ 3:56PM
ఎపిలో కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుందని కన్ఫర్మ్ అయ్యింది. వచ్చే నెల నాలుగో తేదీన వచ్చే ఫలితాల తర్వాత టిడిపి జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవి అధిరోహిస్తున్న నేపథ్యంలో తప పరిపాలనలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి లేఖ రాశారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు.
ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం ఎన్నికల నియమావళికి విరుద్ధం అని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఇంకా ముగియనందున ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ సరికాదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. సీఎంవోలో ఉన్నవారికే పదోన్నతులు పరిమితం చేశారని ఆరోపించారు. కన్ఫర్మేషన్ జాబితా తయారీలో పారదర్శకత లేదని విమర్శించారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ జాబితాను పునఃపరిశీలించాలని చంద్రబాబు యూపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు.