చెప్పుతో కొట్టండి.. సీపీఎస్ రద్దు హామీపై చంద్రాగ్రహం..
posted on Dec 15, 2021 @ 2:23PM
ఢిల్లీలో వైసీపీ ప్రభుత్వం బిచ్చం ఎత్తుకుంటోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక కష్టాల నుంచి కాపాడాలని వేడుకుంటుందని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేసి.. ఇప్పుడు అడుక్కుంటే అవుతుందా? అని నిలదీశారు. రెండున్నరేళ్లలో ఏపీని ఇంత భ్రష్టు పట్టించిన సీఎం ఎక్కడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి గ్రాఫిక్స్ అంటున్న వైసీపీ నేతలు.. హైదరాబాద్‌లో తాను ఏమి చేసానో చూడాలని చంద్రబాబు సవాల్ చేశారు. రెండు కళ్లుగా ఉన్న అమరావతి, పోలవరాన్ని పొడిచేసి.. ఏపీని గుడ్డిగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 టాయిలెట్లు కట్టలేని జగన్.. 3 రాజధానులు కడతారా? అంటూ మండిపడ్డారు.
సీపీఎస్ రద్దుపై జగన్ హామీ ఏమైంది? అని టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. హామీ నెరవేర్చకపోతే చెప్పుతో కొట్టండి అన్నారు.. ఇప్పుడేం చెబుతారు? అని ప్రశ్నించారు. జగన్ ఒక దొంగ పిల్లి.. కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడడం లేదనుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ అని ఓటేసిన ప్రజలు.. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు సమక్షంలో రిటైర్డ్ ఐపీఎస్ శేక్షావలి, నూర్ భాషా వర్గ నేతలు టీడీపీలో చేరారు. మైనారిటీల అభివృద్ధికి టీడీపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రపతిగా కలాంను చేసిన సందర్భం ఎక్కువ తృప్తి నిచ్చిందని చంద్రబాబు అన్నారు. ఐటీకి ఇచ్చిన ప్రోత్సహం వల్లే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉన్నాడని తెలిపారు.