చంద్రమోహన్‌కి గుండెపోటు
posted on Feb 19, 2015 @ 2:49PM
ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్కు గుండెపోటు వచ్చింది. దాంతో ఆయనను అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఐసీయులో వుంచి చికిత్స అందిస్తున్నారు. చంద్రమోహన్‌కు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. 1966లో ‘రంగుల రాట్నం’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన వందలాది చిత్రాల్లో కథానాయకుడిగా, సహాయ పాత్రల్లో నటించారు.